ప్రేమించి.. పెళ్ళాడి.. గర్భవతిని చేసి | Pregnant Woman Complaint on Husband in Shadnagar | Sakshi
Sakshi News home page

ప్రేమించి.. పెళ్లాడాడు

Published Fri, Jul 31 2020 8:29 AM | Last Updated on Fri, Jul 31 2020 8:30 AM

Pregnant Woman Complaint on Husband in Shadnagar - Sakshi

షాద్‌నగర్‌రూరల్‌: నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేనిదే నేను లేనన్నాడు... నీతో కలిసి ఉంటానంటూ పెళ్లికూడా చేసుకున్నాడు. తీరా 7 నెలల గర్భవతిని చేశాక ఇప్పుడు వదిలేస్తానంటున్నాడంటూ ఓ వక్తి చేతిలో మోసపోయిన యువతి గురువారం షాద్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి... షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన వడ్లఅఖిల్, శ్రీవాణి ప్రేమించుకున్నారు. 9నెలల క్రితం పెళ్లి చేసుకుందామని అఖిల్‌ కోరడంతో పెద్దల ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అఖిల్‌ తన అత్త ఇంటికి తీసుకెళ్తాడని శ్రీవాణి భావించింది. కానీ అఖిల్‌ పెళ్లి తర్వాత శ్రీవాణిని బయట హస్టల్స్‌లో ఉంచుతూ కాలం గడుపుతూ వచ్చాడు.

పెళ్లి తరువాత గర్భం దాల్చిన విషయమై పలుమార్లు ఇరువురు గొడవకు దిగారు. అబార్షన్‌ చేయించుకోవాలని శ్రీవాణిపై భర్త అఖిల్‌ ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇలా ఎన్ని రోజులు బయట కాపురం పెడతావు, మీ ఇంటికి తీసుకువెళ్లవా అంటూ శ్రీవాణి నిలదీయంతో షాద్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. గర్భవతినని తెలిసికూడా ఒక్కరోజు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని శ్రీవాణి వాపోయింది. నిన్ను నమ్మి వస్తే ఇలా చేస్తావా, మీ ఇంటికి తీసుకుపోవా అని అడిగితే ఎక్కువ మాట్లాడితే నిన్ను వదిలేస్తా అంటూ బెదిరిస్తుŠాన్నడు. ఇంటికి వస్తే చంపేస్తామని కుటుంబ సభ్యులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం 7 నెలల గర్భవతిని, నన్ను వదిలేస్తే ఎలా బతకాలి. నాకు న్యాయం చేయాలని శ్రీవాణి పోలీసులను ఆశ్రయింది. ఈ విషయమై విచారణ చేపట్టి బాధిత యువతికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement