శర్వంతి రహస్య వివాహం
లైఫ్ ఆఫ్ పై ఆంగ్ల చిత్రం హీరోయిన్ శర్వంతి వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఈ భామ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. లైప్ ఆఫ్ పై చిత్రం గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులతో పాటు మొత్తం ఎనిమిది ఆస్కార్‌లను గెలుచుకున్న గొప్ప చిత్రం లైఫ్ ఆఫ్ పై. పుదుచ్చేరికి చెందిన సూరజ్ శర్మ హీరోగా నటించిన ఈ చిత్రంలో చెన్నైకి చెందిన శర్వంతి హీరోయిన్‌గా నటించారు. ఈ భామకు వ్యాపార వేత్త సమీర్ భరత్‌రామ్‌కు మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఈ ప్రేమ జంట ఇటీవల అనూహ్యంగా రహస్య వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నిడారంబరంగా జరిగింది. అయితే పెళ్లి కారణంగా శర్వంతి నట జీవితానికి ఎలాంటి ఆటంకం కలగదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. శర్వంతికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయని, వాటిని అంగీకరించే విషయమై చర్చిస్తున్నట్లు వారు తెలిపారు. తన రహస్య వివాహం గురించి శర్వంతిని అడగ్గా అయ్యో ఆ వ్యవహారం గురించి ఇప్పుడెందుకులే అంటూ నిట్టూర్చారు. అయితే ఈ వివాహం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదని సమాచారం.