
ముంబై: హీరోయిన్ ఇలియానా పెళ్లిపై గత కొంతకాలంగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబొనెతో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె పరోక్షంగా వెల్లడించింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా పెట్టిన పోస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది. క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్ చేసింది. తాను షేర్ చేసిన ఫొటో తన భర్త(హబ్బీ) ఆండ్రూ తీశాడని పేర్కొంది. అతడితో పెళ్లిపోయింది కాబట్టే ఆండ్రూను భర్తగా సంబోధించిందని అభిమానులు అంటున్నారు.
కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2014లో ముంబై రెస్టారెంట్‌లో జంటగా కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి బాలీవుడ్ కార్యక్రమాలు, వేడుకలకు జంటగానే హాజరవుతూ వచ్చారు. తామిద్దరి ఫొటోలను ఇలియానా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తుండటంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అప్పట్లోనే అంతా అనుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment