
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ ఎక్స్‌పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్‌ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్‌లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్‌ఫామ్‌లను కోరారు.
స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్‌లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్‌లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్‌లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్‌ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.
కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment