
‘బ్రోచేవారెవరురా’ అనే అచ్చ తెలుగు టైటిల్‌తో మంచి హిట్ సినిమా తీశారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇప్పుడు నానీతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది తనకి. ఈ సినిమాకి కూడా ఓ క్రేజీ టైటిల్ అనుకుంటున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు.
మలయాళ నటి నజ్రియా నజీమ్ ఇందులో హీరోయిన్‌గా చేయబోతున్నారు. నజ్రియా చేయబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు ‘అంటే సుందరానికి...’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. టైటిల్ రోల్‌లో నాని కనిపిస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారట. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తారు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment