ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడూ ప్రత్యేకమే : హీరోయిన్‌ | Nazriya Nazim Joins First Day Shooting Of Telugu Debut Movie | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడూ ప్రత్యేకమే : హీరోయిన్‌

Published Mon, Apr 19 2021 10:31 AM | Last Updated on Mon, Apr 19 2021 4:46 PM

Nazriya Nazim Joins First Day Shooting Of Telugu Debut Movie - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్‌. రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల భామ  ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే నాచ్యులర్‌ స్టార్‌ నానీ సరసన 'అంటే సుందరానికి...' అనే చిత్రంతో తొలిసారిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో  నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరో విశేషం. ఈ సినిమా షూటింగ్‌ కోసం నజ్రియా తన భర్త ఫాహద్‌ ఫజిల్‌తో కలిసి హైదరాబాద్‌ వచ్చింది.

దీనికి సంబంధించి అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. 'అందరికీ నమస్కారం.  ఈరోజు నా ఫస్ట్‌ తెలుగు మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడూ ప్రత్యేకమే.'అంటే సుందరానికి'...నాకు ఎప్పటికీ ప్రత్యేకమే' అంటూ తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నాజ్రియా..అంజలీ మీనన్‌’ కూడె’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నాజ్రియా భర్త ఫాహిద్ ఫాజిల్ సైతం తెలుగులో తొలిసారిగా పుష్ప సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. 

చదవండి :  బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన స్టార్‌ హీరోయిన్‌ భర్త
వర్మ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement