Nani Ante Sundaraniki Movie Shoot Wrapped Up, Nani Shares Video Goes Viral - Sakshi
Sakshi News home page

Nani Ante Sundaraniki Movie: ‘అంటే  సుందరానికీ..’ షూటింగ్‌ పూర్తి

Published Tue, Jan 25 2022 7:58 AM | Last Updated on Tue, Jan 25 2022 8:53 AM

Nani Starrer Ante Sundaraniki Shoot Wrapped Up - Sakshi

Ante Sundaraniki starring Nani and Nazriya wraps up shoot: నాని తాజా చిత్రం ‘అంటే  సుందరానికీ..’కి గుమ్మడికాయ కొట్టేశారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా నజీమ్‌ ఫాహద్‌ హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ .వై నిర్మాతలు. ‘‘ఈ సంవత్సరం రోలర్‌ కోస్టర్‌ చిత్రం (అంటే సుందరానికీ) షూటింగ్‌ పూర్తయింది.

ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ‘కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్‌’ అనేది నాని పాత్ర పేరు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: చెర్రీ, కెమెరా: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌ సాగర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement