Shruti Haasan to play a key role in Nani30 - Sakshi
Sakshi News home page

Shruthi Haasan : నాని30లో హీరోయిన్‌ శ్రుతి హాసన్‌.. మరి మృణాల్‌ సంగతి?

Published Sat, Apr 29 2023 7:25 PM | Last Updated on Sat, Apr 29 2023 7:50 PM

Shruthi Haasan Joins Nani30 For Key Role - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని దసరా మూవీతో ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన నటిస్తున్న నాని30పై భారీ అంచనాలు ఉన్నాయి.నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. మృణాల్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.

చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం మీటర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.. 

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది.ఇందులో హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ ఇచ్చిన శ్రుతిహాసన్‌ ఈ సినిమాలో ఎలాంటి పాత్రతో మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement