
తాజాగా అంటే సుందరానికి సినిమా నుంచి నజ్రియా లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మిస్ లీలా థామస్‌ను పరిచయం చేస్తున్నాంటూ హీరోయిన్ ఫొటో ఉన్న పోస్టర్ వదిలారు. ఇందులో నజ్రియా ఒక చేతికి వాచ్ పెట్టుకుని మరో చేతిలో..
Ante Sundaraniki Movie Nazriya Look: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'. దర్శకుడు వివేక్ ఆత్రేయ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. నజ్రియాకు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. తాజాగా అంటే సుందరానికి సినిమా నుంచి నజ్రియా లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మిస్ లీలా థామస్‌ను పరిచయం చేస్తున్నాంటూ హీరోయిన్ ఫొటో ఉన్న పోస్టర్ వదిలారు. ఇందులో నజ్రియా ఒక చేతికి వాచ్ పెట్టుకుని మరో చేతిలో కెమెరా పట్టుకుని ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. పోస్టర్ చూస్తుంటే ఆమె ఫొటోగ్రాఫర్‌గా కనిపించనుందని ఇట్టే తెలిసిపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 10న ఈ సినిమా విడుదల కానుంది.
A photographer sailing in her ocean of Dreams 📸🌊
— Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2022
Introducing our Electric Charm⚡#NazriyaFahadh as Ms.Leela Thomas ❤️😍
▶️ https://t.co/OrQfjjazi1
Alage, Happy Holi! Amen.#AnteSundaraniki#ZerothLookOfLeela@NameisNani #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/wwqZk1ZK6O
చదవండి: బాక్సాఫీస్ వద్ద 'ది కశ్మీర్ ఫైల్స్' సునామీ, ఇప్పటిదాకా ఎంత వచ్చాయంటే?