పెళ్లితో చిన్న కామా... మళ్లీ ఇప్పుడు కంటిన్యూ! | Nazriya's return to cinema: Why we can't wait to see her on screen again | Sakshi
Sakshi News home page

పెళ్లితో చిన్న కామా... మళ్లీ ఇప్పుడు కంటిన్యూ!

Published Mon, Nov 6 2017 2:02 AM | Last Updated on Mon, Nov 6 2017 2:02 AM

Nazriya's return to cinema: Why we can't wait to see her on screen again - Sakshi

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది ఈతరం హీరోయిన్ల ఫిలాసఫీ! అందువల్లే, ప్రేక్షకుల్లో మంచి పేరున్నప్పుడు నాలుగు రాళ్లు వెనక వేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. నజ్రియా నజీమ్‌ మాత్రం కొంచెం డిఫరెంట్‌! ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే... అన్నట్టు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ, ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా? తెలుగులోనూ మంచి హిటై్టన ‘రాజా రాణి’లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో నటించిన హీరోయిన్‌. 2014 ఆగస్టులో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు చిన్న కామా (,) పెట్టారామె. ఇప్పుడు కామా తర్వాత కదలిక వచ్చింది. కొత్త సినిమాకు నజ్రియా నజీమ్‌ సంతకం చేశారు. అంటే... నటిగా మళ్లీ కెరీర్‌ కంటిన్యూ చేస్తున్నారన్న మాట! మహిళా దర్శకురాలు అంజలీ మీనన్‌ తీయనున్న సినిమాలో ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేయడానికి నజ్రియా అంగీకరించారు. ఆమె కూడా ఈ వార్తను కన్ఫర్మ్‌ చేశారు. ‘‘మీ నెక్ట్స్‌ సిన్మా ఎప్పుడు? –  ‘బెంగళూరు డేస్‌’ తర్వాత నన్నందరూ ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. వాళ్లకు నా ఆన్సర్‌ ఇదే... బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌.. ఈ సినిమాలో పృథ్వీరాజ్, పార్వతి, నేనూ! లవ్‌’’ అని నజ్రియా నజీమ్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement