Nazriya Nazim Dances With Nani And His Wife Anjana For Ante Sundaraniki Song, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ante Sundaraniki: నజ్రియాతో కలిసి నాని భార్య స్టెప్పులు.. వీడియో వైరల్‌

Published Thu, Jun 9 2022 2:38 PM | Last Updated on Thu, Jun 9 2022 3:20 PM

Nazriya Nazim Dances With Nani And His Wife For Ante Sundaraniki Song - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ మూవీతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(జూన్‌ 10)న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్‌. అందులో నాని,నజ్రియా స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

(చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్​)

ఇదిలా ఉంటే.. ఈ పాటకు నజ్రియాతో కలిసి స్టెప్పులేసింది నాని భార్య అంజన. స్క్రీన్‌పై పాట ప్లే అవుతుంటే.. నజ్రీయా, అంజనా..తమకు నచ్చిన విధంగా స్టెప్పులేశారు. ఇక చివర్లో వీరితో నాని కూడా జత కట్టాడు. ఈ వీడియోని నజ్రీయా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. నాని, అంజ‌నల‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement