నజ్రియా ఈజ్‌ బ్యాక్‌..! | Nazriya Nazim To Reentry in Tamil Cinema | Sakshi
Sakshi News home page

నజ్రియా ఈజ్‌ బ్యాక్‌..!

Published Sun, Sep 3 2017 10:17 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

నజ్రియా ఈజ్‌ బ్యాక్‌..!

నజ్రియా ఈజ్‌ బ్యాక్‌..!

తమిళసినిమా: హీరోయిన్ గా మాలీవుడ్, కోలీవుడ్‌ల్లో చాలా వేగంగా ఎదిగిన నటి నజ్రియా. మాతృభాషలో పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో లక్షలాది మంది అభిమానుల మనసుల్ని దోచుకున్న ఈ కేరళాకుట్టి నేరం అనే చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది.ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆ భామకు ఇక్కడ వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి.

ధనుష్‌తో నయ్యాండి, దుల్కర్‌సల్మాన్ కు జంటగా వాయైయూడి పేసవుమ్, జై సరసన తిరుమణం ఎనుమ్‌ నిఖా, ఆర్యకు జంటగా రాజారాణి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇలా కథానాయకిగా ఎదుగుతున్న సమయంలోనే నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ను ప్రేమ వివాహం చేసుకుని నటనకు దూరమైన నజ్రియా సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ కథానాయకిగా ఎంట్రీ అవుతోంది.

ప్రముఖ మలయాళ దర్శకురాలు అంజలి మీనన్ ప్రోద్బలంతో నజ్రియా మళ్లీ నటించడానికి రెడీ అయ్యినట్లు సమాచారం. అంజలిమీనన్ దర్శకత్వం వహిస్తున్న మలయాళ చిత్రంలో పృథ్వీరాజ్‌కు జంటగా నటిస్తున్న నజ్రియా తాజాగా తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కనున్న మరో చిత్రంలో దుల్కర్‌సల్మాన్ కు జంటగా నటించడానికి ఒప్పందం కుదుర్చుకుందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మరి రీఎంట్రీలో నజ్రియా లక్కు ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement