మమ్ముట్టి కొడుకుతో నజ్రియా రొమాన్స్ | Nazriya Nazim to romance Mammootty's son | Sakshi
Sakshi News home page

మమ్ముట్టి కొడుకుతో నజ్రియా రొమాన్స్

Published Fri, Nov 29 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

మమ్ముట్టి కొడుకుతో నజ్రియా రొమాన్స్

మమ్ముట్టి కొడుకుతో నజ్రియా రొమాన్స్

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్‌తో సంచలన నటి నజ్రియా నజీమ్ రొమాన్స్ చేస్తోందట. అయితే రొమాన్స్ అనగానే సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లోనూ, డ్యూయెట్లు పాడటమే కాదు నిజ జీవితంలోనే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని జోరుగా షికార్లు కొడుతున్నారట. నేరం చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన మలయాళకుట్టి నజ్రియా. దుల్కర సల్మాన్ మాలీవుడ్‌లో యువ హీరోగా ప్రకాశిస్తున్నారు
 
 . వీరిద్దరూ తాజాగా వామై ముడిపేసుమ్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో వీరిద్దరికి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారిందని యూనిట వర్గాల టాక్. అయితే నయ్యాండి చిత్రంలో తన పొట్టను చూపించినందుకే పోలీసులు, కోర్టులు అంటూ ఫిర్యాదులు చేసి రాద్ధాంతం చేసిన నజ్రియ ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో బహిరంగంగా ప్రేమ పాఠాలు వల్లించడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. మరో విషయం ఏమిటంటే దుల్కర్ సల్మాన్‌కు ఇది వరకే పెళ్లి అయ్యింది. మరిప్పుడీ ప్రేమ వ్యవహారం ఎంతవరకు తీసుకెళుతుందో చూడాలంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement