
డాన్‌తో రొమాన్స్
యదార్థ సంఘటన ఆధారంగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘బలరామ్ వర్సెస్ తారాదాస్’. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, కత్రినాకైఫ్ జంటగా ఐ.వి.శశి రూపొందించిన ఈ చిత్రాన్ని ‘ది డాన్’ పేరుతో తెలుగులో అనువదించారు నిర్మాత ఎం.వెంకట్రావ్. ఈ నెలలోనే విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘మలయాళంలో ఈ చిత్రం రికార్డుల్ని తిరగరాసింది. మలయాళం కంటే తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే సినిమా ఇది. జెస్సీ గిఫ్ట్ సంగీతం, అనల్ అరసు పోరాటాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. హాస్యం, రొమాన్స్ కలగలిసిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని మా నమ్మకం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కేఎస్‌వికే కిశోర్, ఎన్వీ స్వామి, కెమెరా: సంజీవ్ శంకర్, కూర్పు: ముత్యాల నాని.