బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సూపర్‌స్టార్‌? | SuperStar Mohanlal To Host Bigg Boss in Malayalam? | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా మోహన్‌లాల్‌..?

Published Sat, Apr 14 2018 5:03 PM | Last Updated on Sat, Apr 14 2018 8:42 PM

SuperStar Mohanlal To Host Bigg Boss in Malayalam? - Sakshi

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన రియాల్టీ షో బిగ్‌బాస్‌. ఎన్టీఆర్‌​ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ షో టాప్‌ టీఆర్పీలతో సత్తాచాటింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. త్వరలో రెండో సీజన్‌ను కూడా ప్రారంబించేందుకు రెడీ అవుతున్నారు. అయితే మరో భాషలోనూ బిగ్‌బాస్‌ షోను ప్రారంభించేందుకు బిగ్‌బాస్‌​ టీమ్ రెడీ అవుతుంది‌. 

తాజాగా మలయళంలో కూడా ఈ షో మొదలవతున్నట్టు సమాచారం. ఈ రియాల్టీ షోకు హోస్ట్‌గా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ వ్యవహరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ కార్యక్రమానికి  మమ్ముట్టి, రమేష్‌ గోపిలు హోస్ట్‌గా ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే బిగ్‌బాస్‌ టీమ్‌ మాత్రం మోహన్‌లాల్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. మలయాళంలో ఈ షో జూన్‌ చివరిలో ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెల్లువడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement