హారర్‌ థ్రిల్లర్‌ కథతో 'భ్రమయుగం'.. టీజర్‌తో మెప్పించిన స్టార్‌ హీరో | Mammootty Bramayugam Teaser Released Now | Sakshi
Sakshi News home page

హారర్‌ థ్రిల్లర్‌ కథతో 'భ్రమయుగం'.. టీజర్‌తో మెప్పించిన స్టార్‌ హీరో

Published Fri, Jan 12 2024 7:50 AM | Last Updated on Fri, Jan 12 2024 7:51 AM

Mammootty Bramayugam Teaser Released Now - Sakshi

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  నటిస్తున్న తాజా చిత్రం 'భ్రమయుగం'.. డైరెక్టర్‌ రాహుల్‌ సదాశివన్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. మమ్ముట్టి  ఇటీవల నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌'తో  మెప్పించాడు. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. ఇలా విభన్నమైన అంశాలతో సినిమాలు తీసి సూపర్‌ హిట్లు కొడుతున్న ఆయన త్వరలో 'భ్రమయుగం' చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు.

తాజాగా విడుదలైన భ్రమయుగం టీజర్‌ పూర్తిగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పోస్టర్‌తో పాటు  అన్నీ అంశాలు చాలా ప్రత్యేకంగానే ఉన్నాయి. భిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌, భరతన్, అమల్దా లిజ్‌ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ ప్రస్తుతం మాత్రం మలయాళ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement