
నజ్రియా నజీమ్
పెళ్లి తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు మలయాళ నటి నజ్రియా నజీమ్. ఆమెకు 2018 ఫుల్ స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా ‘కూడే’ సినిమాతో సినిమాలు స్టార్ట్ చేశారు. అలాగే భర్త ఫాహద్ ఫాజల్ నటించనున్న ‘వరతాన్’ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి అమల్ నీరద్ దర్శకుడు. నిర్మాతగా మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడారట. శుషిన్ శ్యామ్ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్‌ను నజ్రియా రీసెంట్‌గా పాడగా, రికార్డ్ చేశారట మ్యూజిక్ డైరెక్టర్. 2014లో దుల్కర్ సల్మాన్‌తో యాక్ట్ చేసిన ‘సలాలా మొబైల్స్’ సినిమాలో ఫస్ట్ టైమ్ పాట పాడిన నజ్రియాకు ఇది సింగర్‌గా సెకండ్ సాంగ్. ‘వరతాన్’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment