బన్వర్‌ ఈజ్‌ బ్యాక్‌ | pushpa 2: the rule movie team released Fahad Fazil look | Sakshi
Sakshi News home page

బన్వర్‌ ఈజ్‌ బ్యాక్‌

Published Fri, Aug 9 2024 12:38 AM | Last Updated on Fri, Aug 9 2024 12:38 AM

pushpa 2: the rule movie team released Fahad Fazil look

ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ చాలా కోపంగా ఉన్నాడు. మరి.. ఆయన కోపం ఏ స్థాయిలో ఉంటుందో ఈ డిసెంబరు 6న థియేటర్స్‌లో చూడొచ్చు. ఎందుకు అంటే ‘పుష్ప: ది రూల్‌’ సినిమా ఆ రోజున థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’.

ఈ చిత్రంలో పుష్ప పాత్రలో అల్లు అర్జున్, ఐపీఎస్‌ ఆఫీసర్‌ బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రలో ఫాహద్‌ ఫాజిల్, శ్రీవల్లి పాత్రలో హీరోయిన్‌ రష్మికా మందన్నా నటించారు. గురువారం (ఆగస్టు 8) ఫాహద్‌ ఫాజిల్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా బన్వర్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో ఫాహద్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement