
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
సౌత్ నుంచి సూపర్ హిట్ సినిమాల ఎగుమతి ఈ మధ్య బాగా జరుగుతోంది. తాజాగా నాలుగేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్ నటించిన మలయాళం బ్లాక్‌బస్టర్ ‘బెంగళూర్ డేస్’ కూడా బాలీవుడ్‌లో రీమేక్ కానుందట. ‘యం.యస్.థోని’ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నారట. కేవలం నిర్మించడమే కాకుండా మలయాళంలో నివిన్ పౌలీ చేసిన పాత్రను హిందీ రీమేక్‌లో పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారట ఈ యంగ్ హీరో. ఈ సినిమా రైట్స్ ప్రొడ్యూసర్ వివేక్ రంగాచారీతో ఉండటంతో, ఆ నిర్మాతతో రీమేక్ విషయంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేలోపు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట సుశాంత్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment