Bangalore Days
-
అతని ఫౌజీ సాజిదా
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భర్త, మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుతో కలిసి మన దేశంలో అడుగుపెట్టిన సాజిదాకు ‘బెంగళూరు డేస్’ గుర్తుకొచ్చి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉందా! అవును. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా బెంగళూరులో డిగ్రీ చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ముయిజ్జుతో వివాహం అయింది. ‘ఆమె అతడి అదృష్టం’ అనే మాట ఎలా ఉన్నా ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అని మరోసారి గట్టిగా చెప్పడానికి బలమైన ఉదాహరణ సాజిదా మొహమ్మద్....మాల్దీవుల రాజధాని మాలేలో పుట్టింది సాజిదా. తండ్రి షేక్ మహ్మద్ ఇబ్రహీం ప్రఖ్యాత పండితుడు. రాజకీయ, సామాజిక విషయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉన్న సాజిదా రకరకాల స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేసింది. సాజిదా స్వేచ్ఛకు తల్లిదండ్రులు ఎప్పుడూ ఆడ్డు పడలేదు.బెంగళూరులో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సాజిదా యూకేలోని లీడ్స్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్‌లో సివిల్ సర్వెంట్‌గా పనిచేసింది. యూనిసెఫ్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పిల్లల ఆరోగ్యం నుంచి సృజనాత్మక ప్రతిభను పెం΄÷ందించడం వరకు ఎన్నో కార్యక్రమాలలో భాగం అవుతోంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ‘5 మిలియన్ ట్రీ ప్రాజెక్ట్’ ను లాంచ్ చేసింది. తలసీమియా పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే తలసీమియా చికిత్సపై దృష్టి పెట్టింది.సాజిదా ప్రసంగాలలోని వాడి, వేడి ఏమిటో 2023 అధ్యక్ష ఎన్నిక సమయంలో లోకానికి తెలిసింది. తన అద్భుతమైన ప్రసంగాలతో శ్రోతలను ఆకట్టుకునేది. భర్త విజయానికి ఆమె ప్రసంగాలు ఒక కారణంగా చెప్పవచ్చు.మాల్దీవులలో సైన్స్ రంగంలో మహిళలను, బాలికలను ్ర΄ోత్సహించడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ రంగాలలో మహిళల సంఖ్యను పెంచడానికి దేశ ప్రథమ మహిళగా ఎంతో కృషి చేస్తోంది సాజిదా.‘లింగ వివక్ష లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి’ అనే విషయాన్ని గట్టిగా చెబుతుంది.‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనేది ఆంగ్ల సామెత.తాను మాట్లాడబోయే అంశాలను ఇంట్లో భార్యతో పంచుకోవడం మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుకు అలవాటు. తన ఆలోచనలను సాజిదాతో పంచుకోవడమే కాదు ఆమె సలహాలు తీసుకుంటాడు. ఆ ఇంట్లో తమ ముగ్గురు పిల్లలు యాస్మిన్, ఉమైర్, జాయెద్‌ల గురించి కుటుంబ విషయాలను ఎంత సహజంగా మాట్లాడుకుంటారో జెండర్ ఈక్వాలిటీ నుంచి జీరో వేస్ట్ప్రాజెక్ట్ల వరకు ఎన్నో సామాజిక విషయాలను అంతే సహజంగా మాట్లాడుకుంటారు.‘మా ఆలోచనలు ఎప్పుడు ఒకేరకంగా ఉంటాయి’ అని భార్య గురించి మురిసి΄ోతుంటాడు డా. మొహమ్మద్ ముయిజ్జు. -
Anna Katharina Valayil: సింగర్ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా..
అన్న కేథరిన్ వలయిల్ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగింది. మళ్లీ వారి కుటుంబం స్వదేశానికి వచ్చింది. కొచ్చిన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సౌత్ ఆస్ట్రేలియాలో మూడు సంవత్సరాల పాటు ఇండిజినస్ మ్యూజిక్‌ను స్టడీ చేసింది. డెబ్యూ మ్యూజిక్ వీడియో ‘హాని బీ’ తనకు మంచి పేరు తెచ్చింది. కేథరిన్ చక్కని సింగర్ మాత్రమే కాదు చక్కని కవయిత్రి కూడా. ‘ఏబీసిడీ’ ‘బెంగళూరు డేస్’ ‘లైలా ఓ లైలా’ సినిమాలలో పాటలు రాసింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోసం ఒక మ్యూజిక్ వీడియో తయారు చేసి ఇచ్చింది. తన గొంతే కాదు..పాటలు కూడా బాగుంటాయి అని చెప్పడానికి ఈ వాక్యాలు సాక్ష్యంగా నిలుస్తాయి... ‘నాలుగు గోడల ఇల్లే నీ ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో స్చేచ్ఛగా విహరించాలని మాత్రమే అనుకుంటాయి అక్కడ ఖరీదైన గూడు ఒకటి కట్టాలనుకోవు!’ చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం.. -
బెంగళూర్ టు ముంబై
సౌత్ నుంచి సూపర్ హిట్ సినిమాల ఎగుమతి ఈ మధ్య బాగా జరుగుతోంది. తాజాగా నాలుగేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్ నటించిన మలయాళం బ్లాక్‌బస్టర్ ‘బెంగళూర్ డేస్’ కూడా బాలీవుడ్లో రీమేక్ కానుందట. ‘యం.యస్.థోని’ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నారట. కేవలం నిర్మించడమే కాకుండా మలయాళంలో నివిన్ పౌలీ చేసిన పాత్రను హిందీ రీమేక్‌లో పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారట ఈ యంగ్ హీరో. ఈ సినిమా రైట్స్ ప్రొడ్యూసర్ వివేక్ రంగాచారీతో ఉండటంతో, ఆ నిర్మాతతో రీమేక్ విషయంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేలోపు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట సుశాంత్ సింగ్. -
బాలీవుడ్‌కు సౌత్ సూపర్ హిట్
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన చాలా చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ముఖ్యగాం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా రీమేక్ లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో సౌత్ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా అర్జున్ రెడ్డి, టెంపర్ లాంటి సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సౌత్ సూపర్ హిట్ చేరనుంది. 2014లో మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమా బెంగళూర్ డేస్. దుల్కర్సల్మాన్, నివిన్ పౌలీ, నిత్యా మీనన్ ప్రధాన, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తానే స్వయంగా నటిస్తూ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
నేనూ బాధితురాలినే: నటి
సాక్షి, సినిమా: నటి పార్వతీ మీనన్ నేనూ అలాంటి బాధితురాలినే అని అంటున్నారు. పూ, బెంగుళూర్ డేస్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఇటీవల మలయాళ సినీ సంఘం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అంతకు ముందు సంఘం నుంచి తొలగించబడ్డ హీరో దిలీప్‌ను మళ్లీ సంఘంలోకి తీసుకోవడాన్ని పలువురు నటీమణులు తీవ్రంగా వ్యతిరేకించి సంఘం నుంచి బయటకొచ్చారు. అందులో నటి పార్వతీ మీనన్ కూడా ఉంది. నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను సంఘంలో చేర్చుకోవడాన్ని పార్వతి ఖండించింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ.. సహ నటి కిడ్నాప్‌నకు గురైన సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానన్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇది తనను మరింత దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తనకూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తనను కిడ్నాప్ చేసినవారెవన్నది ఇప్పుడు వెల్లడించి కూడా శిక్ష పడేలా చేయగలనని, అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారు ఏం చేయడానికైనా తెగిస్తారని, తనకు జరిగిన సంఘటనకు తాను మూలన కూర్చుని ఏడవలేదని, దాని నుంచి బయటపడగలిగానని అన్నారు. ఇలాంటి విషయాల్లో స్త్రీలు అవగాహనతోనూ, హెచ్చరికగానూ మసలుకోవాలని పార్వతీమీనన్ హితవు పలికారు. -
కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ కొట్టేసిన సమంత
-
అభిమానులకు థ్యాంక్స్
ముంబై: ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కనక వర్షంతో పాటు పలువుర ప్రశంసలు అందుకున్న చిత్రం బాహుబలి - ద బిగినింగ్. ఆ చిత్రాన్ని విశేషంగా ఆదరించిన తన అభిమానులకు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి మంగళవారం థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు తన మైక్రో బ్లాగ్‌లో ట్విట్ చేశారు. మలయాళంలో విడుదలై.... తమిళంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బెంగుళూరు డేస్' షూటింగ్లో పాల్గొనేందుకు రానా చెన్నై విచ్చేశారు. బాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మొదటి భాగం జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఒకే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటించారు. -
తమిళంలో బెంగుళూరు డేస్
కోలీవుడ్‌లో బెంగుళూరు డేస్ మొదలైంది. మరో విషయం ఏమిటంటే ఈ వారంలో పివిపి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా మూడు చిత్రాలను మొదలెట్టింది. దీంతో ఈ వారం పివిపి వారంగా కోలీవుడ్ పేర్కొంటోంది. ఈ సంస్థ టాలీవుడ్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ యువ నటుడు కార్తీ, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమైం ది. గురువారం ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా ఇంజి ఇడుప్పళగు చిత్రం మొదలైంది. వీటితో పాటు బుధవారం ఆర్య బాబి సింహా, రానా దగ్గుబాటి, శ్రీదివ్య నటిస్తున్న చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ మూడు చిత్రాలు భారీ తారాగణంతో ద్విభాషాచిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. గత ఏడాది మల యాళంలో విడుదలై ఘన విజయం సాధించిన బెంగుళూరు డేస్ చిత్రానికి రీమేక్‌లోనే ఆర్య, రానా దగ్గుబాటి, బాలసింహా, శ్రీదివ్య నటిస్తున్నారు. -
బెంగళూరు డేస్‌లో నేను లేను
బెంగళూరు డేస్ చిత్రం రీమేక్‌లో తాను నటించడం లేదంటోంది సమంత. మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రం బెంగళూరు డేస్. ఈ చిత్రం తమిళం, తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ పొందింది. ఇందులో ఒక జంటగా సిద్ధార్థ్, సమంత నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రేమించుకుంటూ, పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నారనే వార్తల్లో కెక్కిన సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యింది. అయినా వారిద్దరూ బెంగుళూరు డేస్ చిత్ర రీమేక్‌లో కలిసి నటిస్తారని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఇలాంటి పరిస్థితిలో సమంత ట్విట్టర్లో తన అభిమానుల ప్రశ్నలకు బదులిస్తూ బెంగుళూరు డేస్ చిత్రం రీమేక్‌లో తాను నటించడం లేదని వెల్లడించారు. అదే విధంగా సిద్ధార్థ్‌తో ప్రేమకథ కంచికి చేరడం గురించి అడిగిన ప్రశ్నకు అది ముగిసిపోయిన కథ. ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు అంటూ కుండబద్ధలు కొట్టినట్లు బదులిచ్చారు. అందులో సిద్ధార్థ్ కూడా నటించడం లేదని తన మైకో బ్లాక్‌లో పేర్కొన్నారు. ఇది ఆ చిత్ర నిర్మాతలకు షాక్ నిచ్చే విషయమే. సమంత తమిళంలో కత్తి చిత్రంతో తొలిసారిగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా పరత్తు ఎన్రదు కుళే చిత్రంలో నటిస్తున్నారు. ఇది షూటింగ్ పూర్తి అయ్యింది. తెలుగులో అల్లు అర్జున్ సరసన ఒక చిత్రం చేస్తున్నారు. తమిళంలో ఇళయదళపతితో మరోసారి రొమాన్స్‌కు సిద్ధంఅవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వం వహించనున్నారు. -
సిద్ధార్థ్‌తో మరోసారి
ఎక్కువగా వార్తల్లో ఉండే సినీ జంటల్లో సిద్ధార్థ్, సమంత అగ్ర స్థానంలో ఉన్నారు. వీరి గురించి తరచూ ఏదో ఒక న్యూస్ ప్రచారంలో ఉంటుంది. సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారని త్వరలో పెళ్లి పీట లెక్కనున్నారని, వీరి ప్రేమ బ్రేకప్ అయ్యిందని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సిద్దార్థ్‌తో సమంత ప్రేమ అటకెక్కిందని దీంతో ఆమె బాలీవుడ్లో మకాంకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వెల్లడయ్యాయి. తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ నటించిన కావ్య తలైవన్ చిత్రం చాలా బాగుందని సిద్ధార్థ్ చాలా బాగా నటించారని సమంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. దీంతో ఈ ప్రేమికుల మధ్య సఖ్యత ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. సిద్ధార్థ్ సమంత తెలుగులో కలిసి ఒక చిత్రం చేసినా తమిళంలో ఇంతవరకు హీరో హీరోయిన్గా కలిసి నటించలేదు. తీయ వేల సెయ్యనుం కుమార చిత్రంలో అతిథిగా సమంత మెరిశారు. అయితే త్వరలో ఈ జంట ఒక చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ బెంగుళూర్ డేస్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో సమంత రొమాన్స్ చేయనుంది. మరో హీరోగా ఆర్య నటించనున్నారు. తెలుగుచిత్రం బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. -
కుదిరిన కాంబినేషన్?
ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించిన చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ ఎవర్గ్రీన్. ఒకవేళ ఈ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేస్తే ఎవరు నటిస్తే బాగుంటుంది? అనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఎన్టీఆర్, నాగచైతన్యల దగ్గర ఈ చిత్రం గురించి ప్రస్తావించినప్పుడు, ఇందులో నటించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మరి.. గుండమ్మ పాత్రధారిణి దొరక్కో.. వేరే కారణాలవల్లో ఈ రీమేక్ చర్చల దశలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, నాగచైతన్య కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుందనే వార్త ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తోంది. అయితే, అది ‘గుండమ్మ కథ’ కాదు. మలయాళ చిత్రం ‘బెంగ ళూరు డేస్’కి రీమేక్ అని సమాచారం. ఈ చిత్రం రీమేక్ హక్కులను ‘దిల్’ రాజు దక్కించుకున్నారు. అయితే, ఇప్పటికే కొన్ని చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో వేరే అగ్రనిర్మాణ సంస్థతో కలసి ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం ఉందట. ఈ చిత్రంలో నటించడానికి ఎన్టీఆర్, నాగచైతన్య సుముఖంగా ఉన్నారట. -
ఆ ఇద్దరూ 'బెంగళూరు డేస్' కెళ్లారు..
తెలుగులో మరో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. అప్పట్లో తాతలు కలిసి నటిస్తే ఇప్పుడు.. మనవళ్లు కలిసి నటించబోతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, లవర్ బాయ్ నాగ చైతన్య కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతుంది. 'బొమ్మరిల్లు'ను ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మలయాళ చిత్రం 'బెంగళూరు డేస్' రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా హీరోయిన్స్ ఎవరనేది ఖరారు కాలేదు. కాగా 'బెంగళూరు డేస్' హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా హక్కులను మరో నిర్మాణ సంస్థకు అప్పగించినా.. దిల్ రాజు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రుపొందబోతున్నదని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. దాంతో 'నాగ్'తో మిస్ అయిన ఛాన్స్...ఇప్పుడు కొడుకుతో భర్తీ అయినట్లు అయింది. కాగా గత ఏడాది కాలంగా నాగార్జున, బాలకృష్ణల మధ్య మాటలు లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అబ్బాయిలు ఇద్దరూ కలిసి నటించటం విశేషం. -
బెంగళూరు డేసే కాపాడాలి!
-
ముగ్గురు హీరోలు - నలుగురు హీరోయిన్స్
మళయాలంలో పెద్ద హిట్‌గా నిలిచి, కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన 'బెంగళూరు డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయడానికి చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు ప్రధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అదేకోవలో హాస్యరసప్రధానంగా రూపొందే ఈ సినిమాలో నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. తెలుగులో ప్రముఖ నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, దిల్ రాజు కలసి దీనిని నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీనిని ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నందున రెండు భాషల ప్రేక్షకులకు నచ్చిన హీరోహీరోయిన్లు కావాలి. ఒక సినిమాకు ఒక హీరో ఇద్దరు హీరోయిన్లను వెతకడమే నిర్మాతలకు కష్టం. కథ వారికి నచ్చాలి - కాల్షీట్లు ఖాళీ ఉండాలి - ఇవన్నీ కాక ఎవరికి ఏ పాత్ర అనే విషయం తేలాలి - వారి ఆమోదం కావాలి... ఇలా అనేకం కుదరాలి. ఇటువంటి పరిస్థితులలో రెండు భాషలు-ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్లు అంటే నిర్మాత దర్శకులు ఎన్ని తిప్పలు పడాలో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్మాతలు దిగ్గజాలు కాబట్టి కొంతవరకు పరవాలదనుకోండి. బొమ్మరిల్లు సినిమాతో రాత్రికి రాత్రి అగ్రదర్శకుడైపోయిన భాస్కర్‌కు ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు దిల్ రాజు అప్పగించినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు తరువాత ఆరెంజ్, ఒంగోలు గిత్తల పరాజయంతో భాస్కర్‌కు టాలీవుడ్‌కు మొఖం చూపించలేని పరిస్థితి ఎదురైంది. అయినా దైర్యం చేసి ఎంతో నమ్మకంతో దర్శకుడిగా భాస్కర్‌నే దిల్ రాజు ఎంపికచేశారని చెబుతున్నారు. మలయాళంలో అంజలిమీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా సినిమాలో మెలోడ్రామాను శిఖర స్థాయికి తీసుకువెళ్లగలిగిన భాస్కర్ ఈ సినిమా కథ, కథనాలు తెలుగు సంస్కృతికి దగ్గరగా ఉండేవిధంగా మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు సమాచారం.భాస్కర్‌కు ఇదో మంచి సదవకాశంగా భావించవచ్చు. ఇక హీరోల విషయానికి వస్తే నాగచైతన్య - నాని - శర్వానంద్ - ఆర్య - సిద్ధార్ధ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారితో నిర్మాతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ముగ్గురులో ఓ హీరోగా చైతన్య సరిపోతాడని భావిస్తున్నారు. అయితే ఈ కథ విన్న తరువాత చైతన్య పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. అందువల్ల చైతన్య స్థానంలో తమిళ హీరోలు ఆర్య, సిద్దార్థ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఇద్దరూ హీరోల విషయానికి వస్తే నాని - శర్వానంద్‌లను ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. వీరు ఇద్దరూ తెలుగులో పాటు తమిళంలో కూడా ఇమేజ్ ఉన్నవారే. హీరోయిన్ల విషయానికి వస్తే సమంతను ఖరారు చేసినట్లు సమాచారం. ఇంకా ముగ్గురు కావాలి. ఆ వేటలోనే నిర్మాత దర్శకులు ఉన్నారు. ఈ చిత్రం టైటిల్ తెలుగులో 'హైదరాబాద్ డేస్', తమిళంలో 'చెన్నై డేస్' అని పెట్టే అవకాశం ఉంది. - శిసూర్య -
బెంగళూరు డేస్...
‘బెంగళూరు డేస్’... అంజలీమీనన్ దర్శకత్వంలో, దుల్కేర్, ఫహాద్, నివీన్, నాజ్రియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళ చిత్రం ప్రస్తుతం దక్షిణాదిన ఓ సెన్సేషన్. మలయాళ చిత్రసీమ రికార్డులన్నింటినీ తిరగరాసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందీ సినిమా. ‘బెంగళూరు డేస్’ హక్కుల కోసం ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలే పోటీకి దిగాయి. అయితే... ఈ సినిమా హక్కులను ప్రసాద్ పొట్లూరి, ‘దిల్’ రాజు కలిసి సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ హక్కులను కూడా వారే సొంతం చేసుకోవడం విశేషం. త్వరలోనే... ఈ మూడు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. -
మూడు భాషల్లో బెంగుళూరు డేస్
మలయాళ చిత్రం బెంగుళూరు డేస్ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పునర్నిర్మాణానికి సిద్ధం అవుతోంది. నాన్ఈ, వల్లువనుక్కుం పుల్లుం ఆయుధం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ ఈ చిత్ర తమిళ, తెలుగు, హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించడానికి నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది. ఈ చిత్రం కోసం నటుడు ఆర్య, భరత్, క్రేజీ నటి సమంతలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. ఒరిజినల్ చిత్రంలో పాహత్ పాజిల్, దుల్క సల్మాన్, నివిన్ పౌలి, నజ్రియ నజీమ్, నిత్యమీనన్ వంటి యువ తారలు నటించారు. తమిళం, తెలుగు, భాషల్లోను అలాంటి యువ హీరో హీరోయిన్లను నటింప చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రెండు భాషల్లోనూ వేర్వేరు నటీ నటులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరి ఈ హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే హీరో హీరోయిన్లు ఎవరన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది. -
'బెంగళూర్ డేస్'పై మనసు పడ్డ టాలీవుడ్!