సిద్ధార్థ్‌తో మరోసారి
ఎక్కువగా వార్తల్లో ఉండే సినీ జంటల్లో సిద్ధార్థ్, సమంత అగ్ర స్థానంలో ఉన్నారు. వీరి గురించి తరచూ ఏదో ఒక న్యూస్ ప్రచారంలో ఉంటుంది. సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారని త్వరలో పెళ్లి పీట లెక్కనున్నారని, వీరి ప్రేమ బ్రేకప్ అయ్యిందని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సిద్దార్థ్‌తో సమంత ప్రేమ అటకెక్కిందని దీంతో ఆమె బాలీవుడ్‌లో మకాంకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వెల్లడయ్యాయి. తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ నటించిన కావ్య తలైవన్ చిత్రం చాలా బాగుందని సిద్ధార్థ్ చాలా బాగా నటించారని సమంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం. దీంతో ఈ ప్రేమికుల మధ్య సఖ్యత ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది.
సిద్ధార్థ్ సమంత తెలుగులో కలిసి ఒక చిత్రం చేసినా తమిళంలో ఇంతవరకు హీరో హీరోయిన్‌గా కలిసి నటించలేదు. తీయ వేల సెయ్యనుం కుమార చిత్రంలో అతిథిగా సమంత మెరిశారు. అయితే త్వరలో ఈ జంట ఒక చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ బెంగుళూర్ డేస్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో సమంత రొమాన్స్ చేయనుంది. మరో హీరోగా ఆర్య నటించనున్నారు. తెలుగుచిత్రం బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.