బెంగళూరు డేస్‌లో నేను లేను | No Bangalore days remake for Samantha | Sakshi
Sakshi News home page

బెంగళూరు డేస్‌లో నేను లేను

Published Mon, Feb 2 2015 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

బెంగళూరు డేస్‌లో నేను లేను

బెంగళూరు డేస్‌లో నేను లేను

బెంగళూరు డేస్ చిత్రం రీమేక్‌లో తాను నటించడం లేదంటోంది సమంత. మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రం బెంగళూరు డేస్. ఈ చిత్రం తమిళం, తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ పొందింది. ఇందులో ఒక జంటగా సిద్ధార్థ్, సమంత నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రేమించుకుంటూ, పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నారనే వార్తల్లో కెక్కిన సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యింది.
 
 అయినా వారిద్దరూ బెంగుళూరు డేస్ చిత్ర రీమేక్‌లో కలిసి నటిస్తారని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఇలాంటి పరిస్థితిలో సమంత ట్విట్టర్‌లో తన అభిమానుల ప్రశ్నలకు బదులిస్తూ బెంగుళూరు డేస్ చిత్రం రీమేక్‌లో తాను నటించడం లేదని వెల్లడించారు. అదే విధంగా సిద్ధార్థ్‌తో ప్రేమకథ కంచికి చేరడం గురించి అడిగిన ప్రశ్నకు అది ముగిసిపోయిన కథ. ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు అంటూ కుండబద్ధలు కొట్టినట్లు బదులిచ్చారు. అందులో సిద్ధార్థ్ కూడా  నటించడం లేదని తన మైకో బ్లాక్‌లో పేర్కొన్నారు.
 
 ఇది ఆ చిత్ర నిర్మాతలకు షాక్ నిచ్చే విషయమే. సమంత తమిళంలో కత్తి చిత్రంతో తొలిసారిగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా పరత్తు ఎన్రదు కుళే చిత్రంలో నటిస్తున్నారు. ఇది షూటింగ్ పూర్తి అయ్యింది. తెలుగులో అల్లు అర్జున్ సరసన ఒక చిత్రం చేస్తున్నారు. తమిళంలో ఇళయదళపతితో మరోసారి రొమాన్స్‌కు సిద్ధంఅవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వం వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement