కుదిరిన కాంబినేషన్? | NTR Naga Chaitanya Multistarrer | Sakshi
Sakshi News home page

కుదిరిన కాంబినేషన్?

Published Sun, Dec 14 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

కుదిరిన కాంబినేషన్?

కుదిరిన కాంబినేషన్?

ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించిన చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ ఎవర్‌గ్రీన్. ఒకవేళ ఈ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేస్తే ఎవరు నటిస్తే బాగుంటుంది? అనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఎన్టీఆర్, నాగచైతన్యల దగ్గర ఈ చిత్రం గురించి ప్రస్తావించినప్పుడు, ఇందులో నటించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మరి.. గుండమ్మ పాత్రధారిణి దొరక్కో.. వేరే కారణాలవల్లో ఈ రీమేక్ చర్చల దశలోనే ఆగిపోయింది.
 
 ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, నాగచైతన్య కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుందనే వార్త ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తోంది. అయితే, అది ‘గుండమ్మ కథ’ కాదు. మలయాళ చిత్రం ‘బెంగ ళూరు డేస్’కి రీమేక్ అని సమాచారం. ఈ చిత్రం రీమేక్ హక్కులను ‘దిల్’ రాజు దక్కించుకున్నారు. అయితే, ఇప్పటికే కొన్ని చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో వేరే అగ్రనిర్మాణ సంస్థతో కలసి ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం ఉందట. ఈ చిత్రంలో నటించడానికి ఎన్టీఆర్, నాగచైతన్య సుముఖంగా ఉన్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement