Naga Chaitanya Thank You Movie Farewell Lyrical Song Released: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'ఫేర్ వెల్..' అంటూ సాగే పాటను హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సోమవారం (జూన్ 28) విడుదల చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ- 'ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం.. ఆ తర్వాత స్కూల్‌మేట్స్‌తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజ్ లైఫ్‌ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ 'ఫేర్‌వెల్..' పాట ద్వారా చెప్పాం' అన్నారు. 'ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని విక్రమ్ కె. కుమార్ అభిప్రాయపడ్డారు. ''మూడేళ్లు 'థ్యాంక్యూ' కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం'' అని నాగచైతన్య పేర్కొన్నాడు. ''ఫేర్‌వెల్..' సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు'' అని తమన్ తెలిపాడు.
చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment