Naga Chaitanya Thank You Movie Release Postponed, Know New Release Date - Sakshi
Sakshi News home page

Thank You Movie Release: వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్‌లో మార్పు

Jun 25 2022 8:01 AM | Updated on Jun 25 2022 9:08 AM

Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed - Sakshi

అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్‌ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్‌లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed: అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్‌ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్‌లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు చేశారు. ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ ప్రకటించారు. 

విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అవికా గోర్‌ మరో కీలక పాత్ర పోషించింది. ''మా టీజర్‌ సినిమాపై ఆసక్తి పెంచగా, 'మారో..', 'ఎంటో ఏంటేంటో..' పాటలు చార్ట్ బస్టర్స్‌ అయ్యాయి. చైతన్య కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.'' అని చిత్రబృందం పేర్కొంది. 

చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్‌ ఏంటంటే ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement