sri venkateshwara creations
-
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుందని దిల్ రాజుకు చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ పెద్దల మధ్య సమావేశం జరగడం శుభసూచకమని పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని, నాయకత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపింది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని రాసుకొచ్చింది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.కాగా.. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎంతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భేటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.We are delighted with the fruitful meeting held today between the Telangana Government and representatives of the Telugu Film Industry facilitated by the Film Development Corporation of Telangana.We deeply appreciate the visionary leadership of our Honourable Chief Minister Sri…— Sri Venkateswara Creations (@SVC_official) December 26, 2024మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. గ్లోబల్ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల దిశగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి దూరదృష్టికి ఇండస్ట్రీ ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని పేర్కొంది.అలాగే సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంలో ప్రభుత్వానికి మద్దతుగా ఇండస్ట్రీ పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దుతుగా ఉంటామని మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. మన సమాజ ఉజ్వల భవిష్యత్తు కోసం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చింది. We sincerely thank the Government of Telangana, Honorable Chief Minister Shri @revanth_anumula Garu, Cinematography Minister @KomatireddyKVR Garu, and Deputy Chief Minister @Bhatti_Mallu Garu for their visionary leadership and steadfast encouragement towards the growth of the…— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024 -
Dil: ‘దిల్’ రాజు.. బాక్సాఫీస్ రారాజు
తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు, ఆ సంస్థ అధినేత దిల్ రాజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. హీరో,హీరోయిన్ ఎవరనేది చూడకుండా థియేటర్స్‌కి వస్తున్నారు సినీ ప్రియులు. అయితే ఇదంత ఒక్కరాత్రిలో వచ్చిన సక్సెస్ కాదు. ఎన్నో ఒడిదుడుకులు..అనుభవాలతో నేడు ఈ స్థానంలో నిలబడ్డారు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారాడు. 20 ఏళ్ల క్రితం (2003, ఏప్రిల్ 4) ‘దిల్’ సినిమా విడుదలై ప్రేక్షకుల ‘దిల్’గెలుచుకుంది. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వెలమకుచ వెంకటరమణారెడ్డి(దిల్ రాజు) తన స్నేహితుడు గిరి, తమ్ముడు శిరీష్ తో కలిసి నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. అప్పటి నుంచి వెంకటరమణారెడ్డి కాస్త ‘దిల్ రాజు’గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా తన సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై సినిమాలు నిర్మిస్తూ కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకుని గోల్డెన్ లెగ్ నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్నారు. ఈ 20 ఏళ్లతో 50 చిత్రాలను నిర్మించి అత్యధిక సక్సెస్ రేటు సాధించారు. మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో పాటు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోనూ దిల్ రాజు సినిమాలు చేశాడు. మరోవైపు రౌడీ బాయ్స్ చిత్రంతో తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్‌రెడ్డి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులను పరిచయం చేశాడు. 2004లో ఆర్య సినిమాతో సుకుమార్‌ని పరిచయం చేశాడు. ఇక 2006లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతోనే భాస్కర్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మున్నా సినిమాతో వంశీ పైడిపల్లిని, కొత్త బంగారులోకం సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాలను టాలీవుడ్‌కి అందించారు. ‘వారిసు’చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హీరోగా నటించిన ఆ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ 20 ఏళ్ల జర్నీలో దిల్ రాజు ఎన్నో అవార్డులను పొందారు. ‘శతమానం భవతి’తో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. బలగంతో అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్.. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేశాడు. ఈ ప్రొడక్షన్ హౌస్‌కు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యానర్లో ఇటీవల ‘బలగం’సినిమాను నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కమెడియన్ వేణు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని దిల్ రాజు తపిస్తాడు. అందువల్లే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఏదో ఒక వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు విశ్వసిస్తారు. -
సమంత శాకుంతలం.. లిరికల్ సాంగ్ అవుట్
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఋషివనములోనా' మరో లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రిలీజై అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవుతున్న శాకుంతలం సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఈ సాంగ్ లిరిక్స్ శ్రీమణి అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. -
Vishwak Sen: 'ఓరి దేవుడా' బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని చిత్రబృందం అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం అక్టోబర్ 21 థియేటర్లలో కనువిందు చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. Vishwak Sen: యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు) పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా.. లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వేంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. -
వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు
Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed: అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్లో చిన్న మార్పు చేశారు. ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అవికా గోర్ మరో కీలక పాత్ర పోషించింది. ''మా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా, 'మారో..', 'ఎంటో ఏంటేంటో..' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. చైతన్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.'' అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? #ThankYouTheMovie is now hitting the screens on July 22nd! It will be worth the wait...We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 #ThankYouTheMovie in Theatres on July 22nd😍https://t.co/ABhrv9Ndap#ThankYouOnJuly22nd@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/RlPP5acpJU — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 -
విజయ్-వంశీ పైడిపల్లి సినిమా వచ్చేది ఆ పండుగకే..
Vijay Vamshi Paidipally Movie Will Release In 2023: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా ఓ సినిమా రానుంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మంగళవారం (మే 10) తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో భారీ తారాగణం కనువిందు చేయనుందని సమాచారం. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనువిందు చేయనున్నారట. వీరితో పాటు శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. అలాగే ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. భారీ తారాగణంతోపాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు కూడా వర్క్ చేస్తున్నారు. చదవండి: పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు Privileged to have @RealSarathKumar sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @karthikpalanidp#TeamThalapathy66 pic.twitter.com/9tYxYISbSP — Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పూజా హెగ్డె ఐటమ్ సాంగ్ షురూ.. ఇక మరింత ఫన్
Pooja Hegde F3 Movie Item Song Starts: ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సుమారు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడుతూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్గా మారింది ఈ బ్యూటీ. ఇటీవల 'అరబిక్ కుతు' సాంగ్‌లో విజయ్‌తో కలిసి అదరగొట్టింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి'గా జిగేలుమనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ 'ఎఫ్ 3' సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ పాట చిత్రీకరణను శుక్రవారం (ఏప్రిల్ 15) న ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 7 ఎకరాల్లో వేసిన అద్భుతమైన సెట్లో ఈ పార్టీ నెంబర్‌ను షూట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరోహీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారట. ఒకే స్క్రీన్‌పై బుట్టబొమ్మ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీరన్ పిర్జాదా, సోనాల్ చౌహన్ కనిపించడం నిజంగా ఫన్‌గానే ఉండనుంది. ఈ పాటను రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 3' చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే Lets get this party started💃 The Ravishing beauty @hegdepooja joins #F3Movie to add spice to our SPECIAL PARTY SONG🎶#F3OnMay27@VenkyMama @IAmVarunTej@AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/SNZRyJFbD1 — Sri Venkateswara Creations (@SVC_official) April 15, 2022 -
రౌడీ బాయ్స్ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్ రాజు
‘‘ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ ‘రౌడీ బాయ్స్’. చాలా కాలం తర్వాత మా బ్యానర్లో వస్తున్న యూత్ ఫిల్మ్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేసిన అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ బాయ్స్’ సినిమాకి హీరో దేవిశ్రీ ప్రసాద్. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించాలంటే మొదట అందర్నీ మెప్పించేది సంగీతమే. ఆశిష్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నామని, మ్యూజిక్ చేయాలని అడిగితే వారం టైమ్ తీసుకుని ఓకే అన్నాడు. దేవిశ్రీ, నా జర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ ‘రౌడీ బాయ్స్’ వేరు. ఇద్దరి హీరోలకంటే అనుపమా పరమేశ్వరన్ పెద్దగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను బాగా చేసింది. దేవిశ్రీ తర్వాత ఈ సినిమాకి తనే సెకండ్ హీరో. దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవలే విడుదలైన మా సినిమా టైటిల్ సాంగ్, ఇప్పుడు విడుదలైన టీజర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు ఆశిష్. ‘‘రౌడీబాయ్స్’ లో మొత్తం 9 పాటలు ఉన్నాయి. పాటలన్నీ ఆడియన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి’’ అన్నారు హర్ష. ‘‘రౌడీ బాయ్స్’ కి మ్యూజిక్ అందించేందుకు ‘దిల్’ రాజుగారు అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఆశిష్ సినిమాకు మ్యూజిక్ అందించడం నా బాధ్యత. ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని ఉంటే నేను ధర్నా చేసేవాణ్ణి. ‘రౌడీబాయ్స్’ సినిమాతో కాలేజీ డేస్‌ను గుర్తుచేసుకుంటారు.. యూత్ అంతా కలిసి నవ్వుకుంటూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆశిష్ నటన చూస్తే తొలి సినిమాకే ఇంత బాగా యాక్ట్ చేశాడేంటి? అనిపించింది. ఆశిష్, విక్రమ్ పోటాపోటీగా నటించారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. చదవండి: కావ్య కోసం కొట్టుకున్న 'రౌడీ బాయ్స్' -
'కావ్య నా పిల్ల'.. కాలర్ పట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్
Rowdy Boys Teaser released: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్ కోసం ఇద్దరు గొడవ పడటం వంటివి టీజర్లో చూపించారు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ట్రైలర్: ‘మొగలిరేకులు’ సాగర్ హీరోగా సినిమా
బుల్లితెరలో నటించి మహిళల ఆదరాభిమానం పొందిన నటుడు సాగర్ ఆర్కే నాయుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సాగర్ తొలిసారిగా హీరోగా నటిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తుండగా సాగర్ హీరోగా ‘షాదీ ముబారక్’ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘మొగిలిరేకులు, చక్రవాకం’ సీరియల్స్‌తో పేరు పొందిన సాగర్ నటించిన ‘షాదీ ముబారక్’ ట్రైలర్‌ను గురువారం నిర్మాత దిల్ రాజు విడుదల చేశాడు. ‘సిద్ధం కండి.. ప్రేమ రైడ్‌కు హార్దిక స్వాగతం పలికేందుకు’ అని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. కొత్త దర్శకుడు పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి చూపుల నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఉంది. సాగర్‌కు జోడీగా దృశ్య రఘునాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్నారై పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. ఒకే రోజు మూడు పెళ్లి సంబంధాలు చూసేందుకు వెళ్లి సాగర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో సినిమా కథ ఉన్నట్టు తెలుస్తోంది. అందంగా.. ఆహ్లాదకరంగా ట్రైలర్ రూపొందించారు. ఈ సినిమాను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ ప్రస్ మీట్