
Rowdy Boys Teaser released: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్ కోసం ఇద్దరు గొడవ పడటం వంటివి టీజర్‌లో చూపించారు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.