‘మనం’లాంటి క్లాసిక్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ వచ్చిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అవికా గోర్, మాళవికా నాయర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య జులై 22 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. దీంతో థియేటర్స్‌లో విడుదలై మూడు వారాలు గడకముందే కంటే ముందే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్ 11 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ విడుదల తేదిని అధికారికంగా తెలియజేస్తూ కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది.
they are here to drown you into a pleasant sea of wholesomeness with a very distinct storyline 🌼#ThankYouOnPrime, Aug 11 pic.twitter.com/S4WOcwpEAc
— prime video IN (@PrimeVideoIN) August 9, 2022
‘థ్యాంక్యూ’ కథేంటంటే..
మనం ఓ స్థాయికి చేరాక.. మనకు సహాయం చేసిన వారిని మరచిపోవద్దు అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీ తెరకెక్కింది. అభి అలియాస్ అభిరామ్(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ కన్సల్‌టెన్సీ చీఫ్ రావు (ప్రకాశ్‌రాజ్) అభికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని ఉండడు. ఓ యాప్‌ని తయారు చేయాలనుకుంటాడు. రావు గారి ద్వారా పరిచమైన ప్రియ(రాశీఖన్నా) చేసిన ఆర్థిక సహాయంతో ఓ యాప్‌ని తయారు చేసి సక్సెస్ సాధిస్తాడు. దాని ద్వారా అభికి మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఆ తర్వాత అభిలో మార్పు మొదలవుతుంది. తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని పట్టించుకోకుండా.. కేవలం డబ్బు, ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ అతనికి దూరం అవుతారు. చివరకు ప్రేమించిన ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్ అవుతాడు.
(చదవండి: ‘బిగ్‌బాస్’ వచ్చేస్తున్నాడు.. ప్రోమో అదిరింది)
తాను ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. స్కూల్, కాలేజీ డేస్‌ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్), చిన్నూ(అవికా గోర్), శర్వా(సుశాంత్ రెడ్డి) కలిసి థ్యాంక్స్ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్‌కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment