అభిమానులకు థ్యాంక్స్ | Daggubati 'thanks' fans for 'Baahubali' response | Sakshi
Sakshi News home page

అభిమానులకు థ్యాంక్స్

Published Tue, Jul 21 2015 5:53 PM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

అభిమానులకు థ్యాంక్స్ - Sakshi

అభిమానులకు థ్యాంక్స్

ముంబై: ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కనక వర్షంతో పాటు పలువుర ప్రశంసలు అందుకున్న చిత్రం బాహుబలి - ద బిగినింగ్. ఆ చిత్రాన్ని విశేషంగా ఆదరించిన తన అభిమానులకు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి మంగళవారం థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు తన మైక్రో బ్లాగ్లో ట్విట్ చేశారు. మలయాళంలో విడుదలై.... తమిళంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బెంగుళూరు డేస్' షూటింగ్లో పాల్గొనేందుకు రానా చెన్నై విచ్చేశారు.

బాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మొదటి భాగం జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఒకే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement