
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన చాలా చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ముఖ్యగాం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా రీమేక్ లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో సౌత్ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా అర్జున్ రెడ్డి, టెంపర్ లాంటి సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.
తాజాగా ఈ లిస్ట్‌లో మరో సౌత్ సూపర్ హిట్ చేరనుంది. 2014లో మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమా బెంగళూర్ డేస్. దుల్కర్‌సల్మాన్, నివిన్ పౌలీ, నిత్యా మీనన్ ప్రధాన, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తానే స్వయంగా నటిస్తూ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.