మూడు భాషల్లో బెంగుళూరు డేస్ | Bangalore Days to be remade in Tamil, Telugu and Hindi | Sakshi
Sakshi News home page

మూడు భాషల్లో బెంగుళూరు డేస్

Published Tue, Jul 1 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

మూడు భాషల్లో బెంగుళూరు డేస్

మూడు భాషల్లో బెంగుళూరు డేస్

మలయాళ చిత్రం బెంగుళూరు డేస్ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పునర్నిర్మాణానికి సిద్ధం అవుతోంది. నాన్‌ఈ, వల్లువనుక్కుం పుల్లుం ఆయుధం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ ఈ చిత్ర తమిళ, తెలుగు, హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించడానికి నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది.
 
 ఈ చిత్రం కోసం నటుడు ఆర్య, భరత్, క్రేజీ నటి సమంతలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. ఒరిజినల్ చిత్రంలో పాహత్ పాజిల్, దుల్క సల్మాన్, నివిన్ పౌలి, నజ్రియ నజీమ్, నిత్యమీనన్ వంటి యువ తారలు నటించారు. తమిళం, తెలుగు, భాషల్లోను అలాంటి యువ హీరో హీరోయిన్లను నటింప చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రెండు భాషల్లోనూ వేర్వేరు నటీ నటులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరి ఈ హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే హీరో హీరోయిన్లు ఎవరన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement