PVP
-
పీవీపీకి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పారిశ్రామికవేత్త ప్రసాద్ వీర పొట్లూరి (పీవీపీ)కి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఈనెల 18 వరకు ఆయన్ను అరెస్టు చేయడం లాంటి చర్య లేవీ చేపట్టవద్దని న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి గురువారం ఆదేశించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పీవీపీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. తనపై కేసును కొట్టివేయాలని, సీఆర్పీసీ సెక్షన్ 41–ఎ కింద నోటీసు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఇలా వేర్వేరుగా పీవీపీ 3 పిటిషన్లు దాఖలు చేశారని ఫిర్యాదుదారుడి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హమేకాదని తెలిపారు. 3 పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని, ముందస్తు బెయిల్‌పై వాదనలు వినాలని పీవీపీ తరఫు న్యాయవాది, ఏపీ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పం దించిన కోర్టు, పీవీపీని అరెస్టు చేయడం లాంటి చర్యలేవీ చేపట్టరాదని బంజా రాహిల్స్ పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. -
జగన్‌కు యూకే డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి ఆదర్శమంటూ యూకే డిప్యూటీ హై కమిషనర్ ఫ్లెమింగ్ ప్రశంసలు కురింపించారు. దీనికి సంబంధించి ఫ్లెమింగ్ ట్వీట్‌ను జోడిస్తూ వైఎస్సార్సీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) శుక్రవారం ట్వీట్ చేశారు. ఫ్లెమింగ్ శుక్రవారం తన ట్వీట్లో ‘4.5 లక్షలమంది వాలంటీర్లు, 11వేల మందికి పైగా సెక్రటరీల సాయంతో ప్రతి 10 లక్షల మందిలో 14వేల మందికి టెస్టులు నిర్వహించారని, అలాగే టెక్నాలజీ సాయంతో క్వారంటైన్‌ను మానిటర్ చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఇది ప్రపంచానికి ఒక పాఠం అంటూ పేర్కొన్నారు. (రైతులు రూపాయి కడితే చాలు: సీఎం జగన్) ఈ ట్వీట్‌పై స్పందించిన వైఎస్సార్సీపీ నేత పీవీపీ ‘కరోనా కట్టడి విషయంలో ఏపీ మోడల్‌ను ప్రపంచానికి రికమెండ్ చేసినందుకు ధన్యవాదాలు. టెక్నాలజీ సాయంతో ప్రతి 50మందిని మ్యాపింగ్ చేస్తున్నాం. దానికి తగినంత మంది మాకు అండగా ఉన్నారు’ అని ఫ్లెమింగ్‌కు రిప్లై ఇచ్చారు. కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచి, దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. అలాగే పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తున్నవారిపై దృష్టి సారించింది. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ పరీక్షలు చేయాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. (అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్) Dear Dr.Fleming.. Many thanks for recommending AP model to the world out there. Deployment of technology to mapping out every 50 persons in the state, first of it’s kind. May the force be with all of us 🙏 https://t.co/77rRtg8Tqb — PVP (@PrasadVPotluri) June 26, 2020 -
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్లగణేశ్ పంపించారని ప్రముఖ సినీనిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ) జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్లగణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ రోడ్ నంబరు 82లో ఉండే ప్రసాద్ వి. పొట్లూరి ఇంటికి శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి అసభ్యపదజాలంతో దూషిస్తూ బండ్లగణేశ్‌తో ఉన్న ఆర్థిక వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై తన కార్యాలయంలో మాట్లాడుకుందామని చెబుతుండగానే తనపట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. టెంపర్ సినిమా నిర్మాణం కోసం బండ్ల గణేశ్ 2013లో తన వద్దకు వచ్చాడని, అందుకోసం రూ.30 కోట్లు రుణం ఇవ్వాల్సిందిగా అడిగాడని చెప్పారు. దీనికి తాను ఒప్పుకుని ఆమేరకు ఒప్పందం చేసుకుని రుణం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇందులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించి మిగిలిన రూ.7 కోట్లను మాత్రం ఇవ్వకుండా ఇప్పటి వరకూ నెట్టుకొచ్చాడన్నారు. 3 నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఇవ్వకపోగా ఆమొత్తానికి సంబంధించి ఇచ్చిన పోస్టుడేటెడ్ చెక్కులు కూడా బౌన్స్ అయినట్లు తెలిపారు. తనపై హత్యాయత్నం చేయాలనుకున్నారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాల్సిందిగా పీవీపీ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా బండ్లగణేశ్ శుక్రవారం రాత్రి పీవీపీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా అనంతరం ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. -
సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు
-
పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ను బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. -
‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’
‘‘క్షణం’ సమయంలో ‘ఏముందిలే చిన్న సినిమా’ అంటూ మా ఆఫీస్ బాయ్ వాళ్ల స్నేహితుడితో ఫోన్లో మాట్లాడాడు. ఆ రోజే ఫిక్స్ అయ్యాను. చాలా తీవ్రంగా కష్టపడాలని. ‘2.0’ వెర్షన్‌లా మారిపోయాను. ఈ సినిమా అతనికే అంకితం చేస్తున్నాను’’ అన్నారు అడివి శేష్. పీవీపీ నిర్మాణంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీ దర్శకుడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ప్రీ–రిలీజ్ ప్రెస్మీట్లో శేష్ మాట్లాడుతూ – ‘‘మా స్నేహితులకు ఈ సినిమా చూపించా. నమ్మకంగా పీవీపీగారితో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ వద్దు. ప్రీమియర్ షో వేద్దాం అన్నాను. నన్ను ఎవరూ నమ్మని సమయంలో ఆయన నమ్మారు’’ అన్నారు శేష్. ‘‘టాలెంట్ ఉన్న వాళ్లను వెతికి పట్టుకోవడంలో పీవీపీగారు బెస్ట్. నమ్మితే ప్రశ్నించరు’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అన్నారు నవీన్ చంద్ర’’. ‘‘కథ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఈ సినిమాకు ఇద్దరు అమ్మాయిలు ఆసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశారు. ఒక సినిమాకి ఇద్దరమ్మాయిలు ఉండటం నా కెరీర్లో ఫస్ట్ టైమ్’’ అన్నారు రెజీనా. ‘‘తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. అందులో మా సినిమా కూడా ఉండబోతోంది. మా సెట్, ఆఫీస్ పని చేయడానికి చాలా సురక్షితమైన ప్రదేశం అని గర్వంగా చెబుతాను’’ అన్నారు పీవీపీ. -
విజయవాడ ప్రజలతోనే ఉంటా : పీవీపీ
సాక్షి, విజయవాడ : విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ నాయకులు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ధన్యవాదాలు తెలిపారు. గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాడినేనన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను, తమ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటామని పీవీపీ అన్నారు. 130 స్ధానాలకుపైగా వైఎస్సార్సీపీ గెలుస్తుందని అనేక సార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా తక్కువ మార్జిన్‌తోనే ఓడిపోయానన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 19 రోజులే పార్లమెంట్ పరిధిలో పర్యటించానని, కొంచెం ముందు వచ్చి ఉంటే భారీ మెజారిటితో గెలిచేవాడినని పేర్కొన్నారు. ఇక నుండి రెగ్యులర్‌గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని తెలిపారు. -
ఎల్లో మీడియాను రోడ్డుకీడ్చుతా: పీవీపీ
సాక్షి, విజయవాడ : తనపై ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై చట్టపరంగానే ఎదుర్కొంటానని విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) తెలిపారు. తనపై చాలామంది వ్యక్తులు, సంస్థలు అవాకులు, చెవాకులు పేలారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం జన్మహక్కుగా భావించేవారికి ఎవరో ఒకరు గుణపాఠం చెప్పాలని పీవీపీ అన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా తప్పే. ఆయన శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నాపై తప్పుడు కేసులు బనాయిస్తే కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. నాపై దుష్ప్రచారం చేసినవారికి లా పవర్ ఏంటో చూపిస్తా. టీవీ 5, మహా న్యూస్, ఒక ఎంపీపై పరువునష్టం దావా వేస్తా. ఒక్కొక్కరిపై రూ.100కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తా. ఇలాంటి వారికి ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలి. ఇప్పుడు నా చేతల్లో చూపిస్తా. ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాలి. నేను చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటా. ఎన్నేళ్లు అయినా పోరాటం చేస్తా. వారిని రోడ్డుకి ఈడుస్తా. లేకుంటే మరొకరు ఇలాగే చేస్తారు. కోల్గేట్ పవర్ స్కామ్‌లో చంద్రబాబు నాపై ఆరోపణలు చేశారు. ఆ స్కామ్‌లో ఉన్నది వై.హరిశ్చంద్రప్రసాద్. ఆయనకు భూములు కేటాయించింది చంద్రబాబే. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నా పేరు ఎక్కడా లేదు. నేను నిర్మాతగా 150 సినిమాలు తీశాను. సౌండ్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌లో మా కంపెనీకి బెస్ట్ అవార్డు వచ్చింది. మా కంపెనీలో పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లు పనిచేశారు. అగ్రిమెంట్ ప్రకారమే మేము నడుచుకుంటాం. దాన్ని ఎవరు అతిక్రమించినా వెంటనే చర్యలు కూడా ఉంటాయి. అది తెలియకుండా మాట్లాడటం సరికాదు. ఎన్నికలు ముగిసేవరకూ నాపై చేస్తున్న దుష్ప్రచారంపై మాట్లాడకూడదని అనుకున్నాను. సోమవారం నుంచి నా చర్యలు ఉంటాయి. పీవీపీ ఎప్పుడూ తప్పు చేయలేదు. నాపై చేసిన ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటా. ఇక తెలుగు నిఘంటువులో యూటర్న్ అనే పదానికి చంద్రబాబు సరిగ్గా సరిపోతారు. 2014లో చంద్రబాబును గెలిపించింది ఇవే ఈవీఎంలు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారు.’ అని అన్నారు. -
మహేష్ మూవీ టైటిల్‌పై క్లారిటీ వచ్చిందా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఫస్ట్ లుక్ గాని టైటిల్ లోగో కాని రిలీజ్ కాలేదు. అయితే చాలా టైటిల్స్ సినిమా పేరు ఇదే అంటూ ప్రచారంలోకి వచ్చాయి. చిత్రయూనిట్ మాత్రం ఏ టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. తాజాగా మహేష్ మూవీ టైటిల్‌పై ఓ క్లారిటీ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విన్నర్ మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా నిర్మాత పీవీపీ చెప్పిన మాటలు సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ తీసుకువచ్చింది. విన్నర్ వేదిక మీద మాట్లాడిన పీవీపీ ఈ ఏడాది నిర్మాత ఠాగూర్ మధు మూడు చిత్రాలను రిలీజ్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న విన్నర్, మిస్టర్, సంభవామి యుగే యుగే చిత్రాలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇప్పటికే మహేష్ సినిమాకు సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అదే సమయంలో మహేష్, మురుగదాస్ చిత్ర నిర్మాత సంభవామి యుగే యుగే అనే చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నాడన్న క్లారిటీ రావడంతో మహేష్ సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
పీవీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు
-
పీవీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు: వంశీ పైడిపల్లి
పీవీపీ, వంశీ పైడిపల్లిల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ మరో నిర్మాత చేతికి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలు హీరోలుగా ఊపిరి సినిమాను తెరకెక్కించారు పీవీపీ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో అదే బ్యానర్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు వంశీ పైడిపల్లి. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా వంశీపైడిపల్లి దర్శకత్వంతో మహేష్ బాబు హీరోగా తాము సినిమా చేయబోతున్నట్టుగా పేపర్ యాడ్ కూడా ఇచ్చింది పీవీపీ సంస్థ, కానీ ఆ ప్రాజెక్ట్‌ను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. దీంతో పీవీపీ, వంశీ పైడిపల్లిల మధ్య వివాదం మొదలైంది. ఊపిరి సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించటం మూలంగా తనకు నష్టాలు వచ్చాయిని.. అందుకే వంశీ, ఇచ్చిన మాట ప్రకారం నెక్ట్స్ ప్రాజెక్ట్ పీవీపీ సంస్థకే చేయాల్సి ఉంది.. కానీ వంశీ మాత్రం వేరే బ్యానర్ లో సినిమా చేస్తున్నాడంటూ పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఊపిరి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ సినిమాకు 20 కోట్లకు పైగా నష్టం వచ్చిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. పీవీపీ సంస్థ వేసిన కేసులు న్యాయ పరంగా ఎదుర్కొంటానని వెల్లడించారు. పీవీపీ సంస్థ పలు భారీ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండగా.. వంశీ పైడిపల్లి.., మహేష్ హీరోగా చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. -
మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..?
-
మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..?
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ బైలింగ్యువల్ సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే చేయనున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. గతంలో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పీవీపీ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుందని ప్రకటించారు. ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పొస్టర్పై మహేష్ స్పందించలేదు. పీవీపీ సంస్థ మాత్రం మహేష్‌తో తమకు రెండు సినిమాల ఒప్పందం జరిగిందని, బ్రహ్మోత్సవం తరువాత మరో సినిమా చేయాల్సి ఉందని ప్రకటించింది. తాజాగా పీవీపీ సంస్థ మహేష్‌తో నిర్మించాల్సిన సినిమా మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మహేష్ బాబు హీరోగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బిగ్ హిట్ అందించిన దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం మహేష్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్న దర్శకుడు, వంశీ పైడిపల్లి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
వంశీతో మహేష్ సినిమా ఎప్పుడంటే..?
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగాం పీవీపీ బ్యానర్ మహేష్ మరో సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత మహేష్ నుంచి గాని, పీవీపీ సంస్ధ నుంచి గాని ఈ సినిమాపై ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో వంశీ, మహేష్‌ల కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపించింది. అదే సమయంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేయటంతో ఇక వంశీ, మహేష్‌ల సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ.., ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబుతో తమ నెక్ట్స్ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈ సినిమా ఉంటుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో కింగ్ నాగార్జునతోనూ ఓ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ చేయనునున్నట్టుగా తెలిపారు. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారిగది సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. -
తమిళంలో కన్నా తెలుగులోనే భారీగా..!
హీరోగా తమిళ నాట పరిచయం అయినా.. తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో కార్తీ. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఘన విజయాలు సాధించిన కార్తీ ప్రస్తుతం తన ప్రతీ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనే ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు. అదే బాటంలో తాజా చిత్రం కాష్మోరాను కూడా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తమిళ్లో కన్నా.. తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుండటం విశేషం. తమిళ నాట ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కోడి సినిమా కాష్మోరా రిలీజ్ రోజే రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల సమస్య ఏర్పడింది, దీంతో కార్తీ సినిమాకు అక్కడ కేవలం 450 థియేటర్లు మాత్రమే దక్కాయి. అయితే తెలుగు నాట ఈ సినిమా పీవీపీ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో దాదాపు 600 థియేటర్లలో కాష్మోరా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
తెలుగు వెండితెరపై మాజీ సీఎం తనయుడు!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ త్వరలో తెలుగు సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. కన్నడ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రం ద్వారా అతడు శాండల్ వుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. కాగా ఊపిరి, బ్రహ్మోత్సవం తదితర చిత్రాలను నిర్మించి భారీ నిర్మాణ సంస్థగా పేరు పొందిన పీవీపీ నిర్మాణ సంస్థ ద్వారా నిఖిల్ కుమార్ తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు దర్శకుడు కానీ, పీవీపీ నిర్మాణ సంస్థగానీ, హీరో నిఖిల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నిఖిల్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆ సంస్థకు మాటిచ్చిన మహేష్ బాబు
బ్రహ్మోత్సవం సినిమాలో నిరాశ పరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌ను ఆదుకునేందుకు మరో సినిమాను చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం మురుగదాస్ సినిమాకు రెడీ అవుతున్న మహేష్, ఆ తరువాత పీవీపీ బ్యానర్లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. మహేష్ లాంటి స్టార్ హీరో మాట ఇవ్వటమే ఆలస్యం కథ వేటలో పడ్డారు పీవీపీ టీం. ఇటీవల అదే బ్యానర్లో ఊపిరి సినిమాతో భారీ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ హీరోగా సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. వంశీ చెప్పిన లైన్ మహేష్‌కు కూడా నచ్చటంతో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా మహేష్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయాల్సి ఉంది. మరి ముందుగా వంశీ సినిమా సెట్స్ మీదకు తీసుకు వస్తాడా..? లేక పూరి సినిమా తరువాతే ఈ సినిమా ఉంటుందా..? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
సంతోషం మన మధ్యే ఉంది : శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. కుటుంబమంతా చూసి, ఆనందించే సినిమాలు తీస్తారాయన. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’... ఇలా శ్రీకాంత్ చేసినవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ని కూడా కుటుంబ సమేతంగా చూసే విధంగానే తెరకెక్కించారు. పీవీపీ పతాకంపై మహేశ్‌బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ముఖ్య తారలుగా పీవీపీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విశేషాలు... ♦ మహేశ్‌బాబు నాకు రెండో సారి అవకాశం ఇవ్వడమే గొప్ప విషయం అనుకుంటున్నా. ఆయన దర్శకుల ఆర్టిస్ట్. ఈ చిత్రకథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ‘మనకెన్నో ఆలోచనలు ఉంటాయి. ఎన్నో లక్ష్యాలుంటాయి. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య మనం అనుకున్నది జరుగుతుందా? లేదా అన్నది ప్రతి ఒక్కరి టెన్షన్. మనుషుల మధ్య ప్రశాంతత లేకుండా పోతోందని ఎక్కడికో వెళిపోతాం. కానీ సంతోషం, ఆనందం, ప్రశాంతత మనుషుల మధ్య మాత్రమే దొరుకుతుంది’ అనే కథాంశంతో రూపొందించాం. ఈ పాయింట్ విన్న వెంటనే మహేశ్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదే ఈ సినిమా చేయడానికి కొండంత బలాన్నిచ్చింది. ♦ విజయవాడ నేపథ్యంలో సాగే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఓ సందర్భంలో కలుసుకున్న నాలుగైదు కుటుంబాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘బ్రహ్మోత్సవం’. నేనొకసారి ఓ చానల్ చూస్తున్నప్పుడు బ్రహ్మోత్సవం అనే పేరు కనబడింది. వెంటనే ఈ సినిమాకు టైటిల్ అదే అని ఫిక్స్ అయ్యాను. ఏడు తరాల కాన్సెప్ట్ అనేదే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే పాయింట్. దాని చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ♦ ఈ సినిమాలో ఎక్కువ మంది సీనియర్ నటీనటులతో పనిచేశాను. కాంబినేషన్ సీన్స్ కారణంగా కాల్షీట్లు దొరక్కపోవడంతో వాళ్ల కోసం ఎక్కువ సార్లు వెయిట్ చేశాను. అంతకు మించి నాకు ప్రత్యేకించి ఎప్పుడూ ఒత్తిడి అనిపించలేదు. ♦ సీనియర్ రచయిత గణేశ్ పాత్రో ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా కోసం ఎంతగానో నాకు హెల్ప్ చేశారు. అది నా స్థాయికి మించిన కథ. కానీ, ఆయన సహకారంతో ఆ సినిమా బాగా వచ్చింది. ‘ముకుంద’ షూటింగ్ టైమ్‌లోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి చెప్పాను. గణేశ్ నాకు రెండు, మూడు పేజీల స్క్రీన్‌ప్లే కూడా రాసిచ్చారు. ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరమైన విషయం. ♦ ఓ సన్నివేశంలో తండ్రి సత్యరాజ్ హడావిడిగా ఫంక్షన్‌కు వెళిపోతుంటే మహేశ్ పాత్ర ఆయన కాళ్లకు చెప్పులు తొడుగుతుంది. మామూలుగా ఏ హీరో అయినా అలా చేయడానికి కాస్త సందేహిస్తాడు. కానీ మహేశ్ ఆ సీన్లోని అంతరార్థాన్ని గ్రహించి వెంటనే ఒప్పుకున్నారు. అంతేగానీ యాడ్ కోసం ఆ సన్నివేశాన్ని చిత్రీకరించలేదు. ఆ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ♦ ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. నేను చాలా కథలు రాసుకున్నా. అయితే నెక్ట్స్ ఎలాంటి సినిమా తీస్తానో ఇప్పుడే చెప్పలేను. -
రానా సినిమాకు అంత బడ్జెటా..?
నటుడిగా సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా దూసుకుపోతున్న రానాకి సోలో హీరోగా మాత్రం ఆశించిన స్ధాయి విజయం దక్కలేదు. ఇప్పటి వరకు రానా హీరోగా వచ్చిన ఏ సినిమా కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. అయినా బాహుబలితో రానాకు వచ్చిన మైలేజ్ కారణంగా రానాతో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న సబ్ మెరైన్ బేస్డ్ వార్ ఫిలిం ఘాజీ. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 70 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కిస్తున్నారట. గతంలో రానా హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ 10 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కినవే. అలాంటిది ఒక్కసారిగా 70 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించటం అంటే రిస్క్ అంటున్నారు విశ్లేషకులు. అయితే భారీ సబ్ మెరైన్ సెట్‌తో పాటు, అండర్ వాటర్ సీన్స్ కూడా ఉండటంతో బడ్జెట్ పెరిగిపోతుంది. నిర్మాతలు ఇంతటి సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాతో రానా జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు రానాతో సినిమా చేస్తే నేషనల్ లెవల్లో భారీగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఘాజీ సినిమాను తెలుగుతో పాటు, హిందీ తమిళ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ అయితే వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అందుకే రానాతో ఇంత భారీ బడ్జెట్ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది పీవీపీ సంస్థ. -
పీవీపీ,టీఎన్టీయూసీ నాయకుల మధ్య ఫ్లెక్సీ చిచ్చు
-
శృతిహాసన్పై క్రిమినల్ చర్యలు !
హైదరాబాద్: హైదరాబాద్: ప్రముఖ సినీ నటి శృతిహాసన్పై కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం ప్రకారం ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించకుండా తప్పుకున్నందుకు ఆమెపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. మరోపక్క, తదుపరి ఆదేశాలవరకు కొత్త చిత్రాలకు సంతకం చేయొద్దని, నటించొద్దని శృతిహాసన్‌కు ఆదేశాలు జారీచేసింది. పిక్చర్ హైజ్ మీడియా లిమిటెడ్ నటుడు నాగార్జున, తమిళనటుడు కార్తీని హీరోలుగాపెట్టి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు నిర్మాణ సంస్ధ నటి శృతిహాసన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాల్షీట్ల సర్దుబాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలె ఆ చిత్రం తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కానీ, అనూహ్యంగా తనకు డేట్లు కుదరడం లేదంటూ షూటింగ్‌కు హాజరులేనని శృతి ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపించింది. ఆమె నిర్ణయంతో తమ చిత్ర నిర్మాణానికి ఆలస్యం అవడమేకాకుండా, భారీ మొత్తంలో నష్టపోతామని, ఆమె అనైతికంగా తీసుకున్న ఈ మోసపూరిత నిర్ణయంపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈ వ్యవహారంపై సినిమా నిర్మాణ సంస్ధ కోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు అందుకు ఆదేశిస్తూ ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆదేశాలిచ్చింది. -
క్రేజీ కాంబినేషన్!
మామూలుగా స్టార్ హీరో నటించే ఏ సినిమా అయినా ప్రేక్షకులకు ఆసక్తికరమే. ఇక మల్టీస్టారర్ అయితే ఆ క్రేజ్ అంబరాన్నంటుతుంది. నాగార్జున, కార్తి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందనే వార్త గత కొంతకాలంగా మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ విషయాన్ని పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ శనివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని ఆయన చెప్పారు. ‘మున్నా’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్, ‘బృందావనం’ వంటి కుటుంబ కథా చిత్రం, ‘ఎవడు’ వంటి మాస్ ఎంటర్టైనర్ని తెరకెక్కించి, ప్రతిభ నిరూపించుకున్న వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. -
మీ అభిమానానికి ధన్యవాదాలు
-
ముగ్గురు హీరోలు - నలుగురు హీరోయిన్స్
మళయాలంలో పెద్ద హిట్‌గా నిలిచి, కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన 'బెంగళూరు డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయడానికి చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు ప్రధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అదేకోవలో హాస్యరసప్రధానంగా రూపొందే ఈ సినిమాలో నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. తెలుగులో ప్రముఖ నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, దిల్ రాజు కలసి దీనిని నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీనిని ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నందున రెండు భాషల ప్రేక్షకులకు నచ్చిన హీరోహీరోయిన్లు కావాలి. ఒక సినిమాకు ఒక హీరో ఇద్దరు హీరోయిన్లను వెతకడమే నిర్మాతలకు కష్టం. కథ వారికి నచ్చాలి - కాల్షీట్లు ఖాళీ ఉండాలి - ఇవన్నీ కాక ఎవరికి ఏ పాత్ర అనే విషయం తేలాలి - వారి ఆమోదం కావాలి... ఇలా అనేకం కుదరాలి. ఇటువంటి పరిస్థితులలో రెండు భాషలు-ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్లు అంటే నిర్మాత దర్శకులు ఎన్ని తిప్పలు పడాలో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్మాతలు దిగ్గజాలు కాబట్టి కొంతవరకు పరవాలదనుకోండి. బొమ్మరిల్లు సినిమాతో రాత్రికి రాత్రి అగ్రదర్శకుడైపోయిన భాస్కర్‌కు ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు దిల్ రాజు అప్పగించినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు తరువాత ఆరెంజ్, ఒంగోలు గిత్తల పరాజయంతో భాస్కర్‌కు టాలీవుడ్‌కు మొఖం చూపించలేని పరిస్థితి ఎదురైంది. అయినా దైర్యం చేసి ఎంతో నమ్మకంతో దర్శకుడిగా భాస్కర్‌నే దిల్ రాజు ఎంపికచేశారని చెబుతున్నారు. మలయాళంలో అంజలిమీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా సినిమాలో మెలోడ్రామాను శిఖర స్థాయికి తీసుకువెళ్లగలిగిన భాస్కర్ ఈ సినిమా కథ, కథనాలు తెలుగు సంస్కృతికి దగ్గరగా ఉండేవిధంగా మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు సమాచారం.భాస్కర్‌కు ఇదో మంచి సదవకాశంగా భావించవచ్చు. ఇక హీరోల విషయానికి వస్తే నాగచైతన్య - నాని - శర్వానంద్ - ఆర్య - సిద్ధార్ధ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారితో నిర్మాతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ముగ్గురులో ఓ హీరోగా చైతన్య సరిపోతాడని భావిస్తున్నారు. అయితే ఈ కథ విన్న తరువాత చైతన్య పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. అందువల్ల చైతన్య స్థానంలో తమిళ హీరోలు ఆర్య, సిద్దార్థ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఇద్దరూ హీరోల విషయానికి వస్తే నాని - శర్వానంద్‌లను ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. వీరు ఇద్దరూ తెలుగులో పాటు తమిళంలో కూడా ఇమేజ్ ఉన్నవారే. హీరోయిన్ల విషయానికి వస్తే సమంతను ఖరారు చేసినట్లు సమాచారం. ఇంకా ముగ్గురు కావాలి. ఆ వేటలోనే నిర్మాత దర్శకులు ఉన్నారు. ఈ చిత్రం టైటిల్ తెలుగులో 'హైదరాబాద్ డేస్', తమిళంలో 'చెన్నై డేస్' అని పెట్టే అవకాశం ఉంది. - శిసూర్య -
ఆగస్టు 1న విజయవాడకు సచిన్!
లెజెండ్ క్రికెటర్, మాస్టర్ బాస్లర్ సచిన్ టెండూల్కర్ విజయవాడకు రానున్నారు. విజయవాడలో పీవీపీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఓ బిజినెస్ మాల్ ను సచిన్ రమేశ్ టెండూల్కర్ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆహ్వాన పత్రాన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. పీవీపీ మాల్ ను విజయవాడలో ఆగస్టు 1 తేదిన సచిన్ రమేశ్ టెండూల్కర్ ప్రారంభించనున్నారు అని ట్విటర్ లో ఆహ్వాన పత్రాల పోస్టింగ్ జోరందుకుంది. అయితే పీవీపీ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. -
మూడు భాషల్లో బెంగుళూరు డేస్
మలయాళ చిత్రం బెంగుళూరు డేస్ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పునర్నిర్మాణానికి సిద్ధం అవుతోంది. నాన్ఈ, వల్లువనుక్కుం పుల్లుం ఆయుధం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ ఈ చిత్ర తమిళ, తెలుగు, హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించడానికి నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది. ఈ చిత్రం కోసం నటుడు ఆర్య, భరత్, క్రేజీ నటి సమంతలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. ఒరిజినల్ చిత్రంలో పాహత్ పాజిల్, దుల్క సల్మాన్, నివిన్ పౌలి, నజ్రియ నజీమ్, నిత్యమీనన్ వంటి యువ తారలు నటించారు. తమిళం, తెలుగు, భాషల్లోను అలాంటి యువ హీరో హీరోయిన్లను నటింప చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రెండు భాషల్లోనూ వేర్వేరు నటీ నటులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరి ఈ హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే హీరో హీరోయిన్లు ఎవరన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది. -
అయ్యో పాపం! నాయకుల కలచెదిరింది.
-
బెజవాడలో విచిత్రం : టిడిపి X జనసేన
చేయి చేయి కలిపి ఎన్నికలలో దిగడానికి నేతలు సిద్ధపడ్డారు. ద్వితీయశ్రేణి నేతలు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. చేతులకు పనిచెప్పడానికి వారు సిద్ధమైయ్యారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఒకే వేదికను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచుకోనున్నారు. అయితే బెజవాడలో మాత్రం పరిస్థితి విచిత్రంగా వుంది. విజయవాడ లోక్‌సభ స్థానం విషయంలో ఇటు చంద్రబాబు, అటు పవన్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా ఉంది. బెజవాడ టిడిపి ఎంపీ టికెట్ పొట్లూరి వరప్రసాద్(పివిపి)కు ఇప్పించేలా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పట్టుబటి టిడిపి సీనియర్ నేత కేశినేని నాని ఈ టికెట్ దక్కించుకున్నారు. దాంవతో పివిపిని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్‌సభ స్థానం కేశినేని నానికి కేటాయించారని తెలిసిన వెంటనే అతనిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని పివిపి వర్గీయులు ప్రకటించారు. 1983లో టీడీపీ సభ్యత్వ పుస్తకాలు అమ్ముకుని సస్పెన్షన్‌కు గురైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నాని అని వారు విమర్శించారు. అతను ఒకే పర్మిట్‌పై 4 బస్సులు తిప్పి ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాడన్నారు. హెచ్-1 వీసాలు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి డబ్బు దోచుకున్న చరిత్ర కేశినేనిదని ధ్వజమెత్తారు. కేశినేని ఓటమికి అన్ని అవకాశాలను వాడుకుంటామని వారు చెప్పారు. కేశినేని నానిని టార్గెట్‌గా చేసుకొని ఈ నెల 19న విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా పొట్లూరి నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇందుకోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో పీవీపీ భేటీ అయినట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికలలో ఓట్లు చీల్చనని పవన్ కళ్యాణ్ విశాఖ సభలో చెప్పారు. ఈ పరిస్థితులలో పొట్లూరితో నామినేషన్ వేయిస్తే, ఓట్లు చీల్చనన్న మాట తప్పారని ప్రజలు అనుకుంటారని జనసేన ఆలోచిస్తోంది. మరి కొన్ని చోట్ల కూడా స్వతంత్ర అభ్యర్థులుగా కొంత మందిని బరిలోకి దింపాలని జనసేన పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమ్మీద నామినేషన్ల పర్వం ముగిస్తే తప్ప బెజవాడ కథ క్లయిమాక్స్‌కు చేరే అవకాశం కన్పించటం లేదు. -
నానీ... నువ్వెలా గెలుస్తావో చూస్తాం !
-
టికెట్ ఖరారైంది... చిచ్చు రగిలింది
-
టీడీపీకి 'కార్పోరేట్' కష్టాలు !
-
పవన్‌కు జై కొడదామా... లేదంటే...
-
విజయవాడ ఎంపీ సీటు ఎవిరికో..?
-
పీవీపీ ఎవరండీ... నేను ఎంపీగానే పోటీ చేస్తా..