పీవీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు: వంశీ పైడిపల్లి | Vamshi Paidipally Preparing Counter Attack Against PVP | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ లో మరో వివాదం..

Published Thu, Jan 5 2017 10:57 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

పీవీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు: వంశీ పైడిపల్లి

పీవీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు: వంశీ పైడిపల్లి

పీవీపీ, వంశీ పైడిపల్లిల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ మరో నిర్మాత చేతికి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలు హీరోలుగా ఊపిరి సినిమాను తెరకెక్కించారు పీవీపీ. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. దీంతో అదే బ్యానర్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు వంశీ పైడిపల్లి.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా వంశీపైడిపల్లి దర్శకత్వంతో మహేష్ బాబు హీరోగా తాము సినిమా చేయబోతున్నట్టుగా పేపర్ యాడ్ కూడా ఇచ్చింది పీవీపీ సంస్థ, కానీ ఆ ప్రాజెక్ట్ను దిల్రాజు, అశ్వనీదత్లు నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. దీంతో పీవీపీ, వంశీ పైడిపల్లిల మధ్య వివాదం మొదలైంది. ఊపిరి సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించటం మూలంగా తనకు నష్టాలు వచ్చాయిని.. అందుకే వంశీ, ఇచ్చిన మాట ప్రకారం నెక్ట్స్ ప్రాజెక్ట్ పీవీపీ సంస్థకే చేయాల్సి ఉంది.. కానీ వంశీ మాత్రం వేరే బ్యానర్ లో సినిమా చేస్తున్నాడంటూ పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఊపిరి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ సినిమాకు 20 కోట్లకు పైగా నష్టం వచ్చిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. పీవీపీ సంస్థ వేసిన కేసులు న్యాయ పరంగా ఎదుర్కొంటానని వెల్లడించారు. పీవీపీ సంస్థ పలు భారీ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండగా.. వంశీ పైడిపల్లి.., మహేష్ హీరోగా చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement