
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి, మహేశ్ బాబు మధ్య స్నేహబంధం మరింత బలపడింది. మహేశ్ గారాలపట్టి సితార, వంశీ కూతురు ఆద్య కలిసి ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా మొదలుపెట్టారు. రెండు ఫ్యామిలీలు టైం దొరికినపుడల్లా సరదాగా గడుపుతుంటాయి. అందుకు ఈ ఫోటోనే నిదర్శనం. మహేశ్-వంశీ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో డిన్నర్ చేశారు. అనంతరం అంతా కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఫోటోని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..ఫన్ ఫ్యామిలీస్..నైటౌట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మహేశ్ ప్రకటించాడు. అయితే వంశీ వినిపించిన కథలు నచ్చకపోవడంతో రిజెక్టు చేశాడు. ఇపుడు పరశురాంతో కలిసి సర్కారు వారి పాట చేస్తున్నాడు ప్రిన్స్.
Comments
Please login to add a commentAdd a comment