ఆ సంస్థకు మాటిచ్చిన మహేష్ బాబు | vamsi paidipally, pvp movie with mahesh babu | Sakshi
Sakshi News home page

ఆ సంస్థకు మాటిచ్చిన మహేష్ బాబు

Published Fri, May 27 2016 1:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

ఆ సంస్థకు మాటిచ్చిన మహేష్ బాబు

ఆ సంస్థకు మాటిచ్చిన మహేష్ బాబు

బ్రహ్మోత్సవం సినిమాలో నిరాశ పరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్ను ఆదుకునేందుకు మరో సినిమాను చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం మురుగదాస్ సినిమాకు రెడీ అవుతున్న మహేష్, ఆ తరువాత పీవీపీ బ్యానర్లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు.

మహేష్ లాంటి స్టార్ హీరో మాట ఇవ్వటమే ఆలస్యం కథ వేటలో పడ్డారు పీవీపీ టీం. ఇటీవల అదే బ్యానర్లో ఊపిరి సినిమాతో భారీ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ హీరోగా సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. వంశీ చెప్పిన లైన్ మహేష్కు కూడా నచ్చటంతో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ముందుగా మహేష్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయాల్సి ఉంది. మరి ముందుగా వంశీ సినిమా సెట్స్ మీదకు తీసుకు వస్తాడా..? లేక పూరి సినిమా తరువాతే ఈ సినిమా ఉంటుందా..? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement