రానా సినిమాకు అంత బడ్జెటా..? | 70 Crore Budget for Ranas Next Ghaji | Sakshi
Sakshi News home page

రానా సినిమాకు అంత బడ్జెటా..?

Published Fri, Feb 26 2016 2:03 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా సినిమాకు అంత బడ్జెటా..? - Sakshi

రానా సినిమాకు అంత బడ్జెటా..?

నటుడిగా సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా దూసుకుపోతున్న రానాకి సోలో హీరోగా మాత్రం ఆశించిన స్ధాయి విజయం దక్కలేదు. ఇప్పటి వరకు రానా హీరోగా వచ్చిన ఏ సినిమా కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. అయినా బాహుబలితో రానాకు వచ్చిన మైలేజ్ కారణంగా రానాతో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న సబ్ మెరైన్ బేస్డ్ వార్ ఫిలిం ఘాజీ. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 70 కోట్ల బడ్జెట్తో భారీగా తెరకెక్కిస్తున్నారట. గతంలో రానా హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ 10 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కినవే. అలాంటిది ఒక్కసారిగా 70 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించటం అంటే రిస్క్ అంటున్నారు విశ్లేషకులు. అయితే భారీ సబ్ మెరైన్ సెట్తో పాటు, అండర్ వాటర్ సీన్స్ కూడా ఉండటంతో బడ్జెట్ పెరిగిపోతుంది.

నిర్మాతలు ఇంతటి సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాతో రానా జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు రానాతో సినిమా చేస్తే నేషనల్ లెవల్లో భారీగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఘాజీ సినిమాను తెలుగుతో పాటు, హిందీ తమిళ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ అయితే వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అందుకే రానాతో ఇంత భారీ బడ్జెట్ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది పీవీపీ సంస్థ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement