నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ను బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు.