Potluri Vara Prasad
-
సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు
-
పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ను బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. -
‘జర ఓపిక పట్టు తమ్మీ’
సాక్షి, అమరావతి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగానే టాటా సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి సేవ చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అన్నారు. కానీ కొంత మంది తామే టాటా సంస్థను ఏపీ తెచ్చామని డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేసే వారు కాస్త ఓపికతో ఉండాలని, త్వరలోనే సీఎం జగన్ వైద్యవ్యవస్థలో మార్పులు తెచ్చి ఆరోగ్యశ్రీకి మళ్లీ పుర్వవైభవాన్ని తీసుకోస్తారని చెప్పారు. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు టాటాను నేనే తెచ్చా అని డబ్బా ఏంటప్ప. సీఎస్ఆర్ కింద అన్ని కంపెనీలు చేయవలసిన సామాజిక సేవ అది. ఆరోగ్యశ్రీ అనే సంచలనం మన దేశంలో జరిగింది. కొన ఊపిరితో ఉన్న వైద్య వ్యవస్థకు సంజీవని ఇచ్చి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురాబోతున్నారు వైఎస్ జగన్. జర ఓపిక పట్టు తమ్మీ’ అని పీవీపీ ట్వీట్ చేశారు. -
‘చంద్రబాబుకు సరిగా బ్రీఫ్డ్ చేసినట్లు లేరు’
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రాచారంపై విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై నేను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయలేదని అన్నారు. ఎడిట్ చేసిన మాటలతో వివాదస్పదం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు అక్కడి వాళ్లు సరిగా బ్రీఫ్డ్ చేసినట్లు లేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ప్రసంగం ఇంగ్లీష్‌లో ఉందని.. చంద్రబాబు గారు జయదేవ్‌తో ట్రాన్స్‌లేట్ చేయించుకుని ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈ ఒక్క అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజా వైఫల్యాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని అసెంబ్లీ, మండలిలలో తీర్మానాలు చేయలేదా అని నిలదీశారు. ప్రధానికి ధన్యవాదములు తెలిపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలకు తెలుసునని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు డీఎన్ఏలోనే ఉన్నాయని విమర్శించారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికే తనపైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 20 రోజుల్లో ఐదేళ్ల జీవితం గురించి నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. మంచి విషయాలపై చర్చ చేద్దామని తెలిపారు. తాను బెజవాడలో పుట్టానని.. టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌లు తన దగ్గర చెల్లవని స్పష్టం చేశారు. పోరాటల్లో మడమ తిప్పేది, వెనుకడుగు వేసేది లేదని వ్యాఖ్యానించారు. తన గురించి బెజవాడ ప్రజలకు బాగా తెలుసనని పేర్కొన్నారు. తాతలు ఇచ్చిన ఆస్తులు కాదు, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కోరారు. ప్రత్యర్థులు చేసే గ్లోబెల్స్ ప్రచారానికి భయపడనని స్పష్టం చేశారు. ఎన్నికల తేదీ ఏప్రిల్ 9వ తేదీన కాదని 11వ తేదీ అని మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి పీవీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
‘చంద్రబాబుకు సరిగా బ్రీఫ్డ్ చేసినట్లు లేరు’
-
రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
-
టైమ్ వేస్ట్ : కేశినేని కామెంట్లపై పీవీపీ
సాక్షి, విజయవాడ: వైఎస్ఆర్ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను చూశామని, మళ్ళీ అటువంటి పాలన రావాలంటే వైఎస్ జగన్ వల్లే సాధ్యం అవుతుందని వైఎస్సార్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, భవకుమార్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ స్థానికుడిగా ఇక్కడి అన్ని సమస్యలు తనకు తెలుసునని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధే తన ధ్యేయమని తెలిపారు. రాజధాని ప్రాంతంగా విజయవాడను మరింత అభివృద్ధి చేయాల్సి వుందన్నారు. ప్రగతి వైపు పరుగు అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. తనపై కేశినేని నాని చేసిన విమర్శలకు సమాధానం చెప్పడం సమయం వృధా చేయడమే అన్నారు. విజయవాడలో వైఎస్ఆర్ హయాంలో 150 కోట్లతో మాల్ నిర్మించి 700 మందికి ఉపాధి కల్పించినట్టు చెప్పారు. తాను ఏ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేయలేదని, లబ్ది పొందలేదని స్పష్టం చేశారు. విజయవాడ నగరానికి బయట ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సినీపరిశ్రమను విజయవాడకు రావాలని కోరతానని అన్నారు. కాగా, పొట్లూరి వరప్రసాద్ సమక్షంలో మైనార్టీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. నమ్మకంతో ఉన్నారు: మల్లాది విష్ణు ప్రజలు వైఎస్సార్సీపీపై పూర్తి విశ్వాసంతో వున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన మోసంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోందని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో టీడీపీకి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఐదేళ్ళలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు అభ్యర్థి బొప్పన భవకుమార్ విమర్శించారు. విజయవాడలో కనీసం రెండు ఫ్లైఓవర్ లను పూర్తి చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలనను మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారని రక్షణనిధి అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారని, ఈ ఎన్నికలతో చంద్రబాబు దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని పేర్కొన్నారు. -
‘ఎవరి ఒత్తిడి లేదు, అందుకే వైఎస్సార్సీపీలో చేరా’
సాక్షి, హైదరాబాద్: విజయవాడ అభివృద్ధే తన ఎజెండా అని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయవాడ వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను పుట్టిపెరిగిన విజయవాడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీలో చేరినట్టు చెప్పారు. తనకు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తానని అన్నారు. రాజధాని అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై వైఎస్ జగన్‌కు స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా చూశారని చెప్పారు. పాదయాత్ర స్ఫూర్తితో చేరా: రత్నబిందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు అన్నారు. వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంతో తాను మేయర్‌గా పనిచేశానని, ఆయన కుటుంబంలోకి మళ్లీ రావడం హ్యాపీగా ఉందని తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను జనంలోకి తీసుకెళ్లడం వైఎస్ జగన్ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర స్ఫూర్తితో పార్టీలో చేరినట్టు తెలిపారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ) -
వైఎస్ జగన్‌కు స్పష్టమైన విజన్ ఉంది
-
పొట్లూరి ఆశలపై నీళ్లుచల్లిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న పీవీపీ గ్రూప్ యజమాని పొట్లూరి వరప్రసాద్ ఆశలపై సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారు. పవన్ మద్దతుతో టీడీపీ టిక్కెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని పొట్లూరి భావించారు. దీని కోసం పవన్ మద్దతు కోసం ఆయనతో ఈరోజు సంప్రదింపులు జరిపారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని సమాచారం. పవన్‌ను ఒప్పించేందుకు పొట్లూరి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆయన ససేమీరా అన్నారని తెలిసింది. పవన్ మద్దతు నిరాకరించడంతో పోటీ చేయడానికి పొట్లూరి వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు తమకు టిక్కెట్ దక్కకుండా చేసిన కేశినేని నానిని ఓడించాలని పొట్లూరి వర్గం వ్యూహాలు పన్నుతోంది. వరప్రసాద్ పోటీ చేసినా, చేయకపోయినా కేశినేనిని ఓడించాలని పొట్లూరి వర్గం పట్టుదలతో ఉంది. నామినేషన్ దాఖలుకు శనివారం వరకు గడువు ఉండడంతో పొట్లూరి ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
పవన్‌కల్యాణ్‌తో పొట్లూరి సమాలోచనలు
సాక్షి, హైదరాబాద్: జనసేన నేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మద్దతుతో పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. చకచకా మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ లోక్‌సభ వదులుకుంటామంటూ సమాచారం పంపించి తీరా సమయానికి టీడీపీకి చెందిన కేశినేని నానికే ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో పొట్లూరి సన్నిహితులు ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి పొట్లూరి మొదట్లో విజయవాడ కుదరని పక్షంలో విశాఖ, రాజమండ్రి, ఏలూరు స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలని తొలుత ఆలోచించారు. రాజకీయ భవితవ్యంపై ఆయన గురువారం పవన్ కల్యాణ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విశాఖపట్టణం లోక్‌సభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆమెపై పోటీ చేసి గెలవలేనని పొట్లూరి చెప్పినట్లు సమాచారం. టీడీపీ దిగిరాని పక్షంలో విజయవాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన తన ఆకాంక్షను వ్యక్తంచేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంలో శుక్రవారం లేదా శనివారం నాటికి ఒక స్పష్టత వస్తుందని, ఇంకా తుది నిర్ణయం జరగలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
విజయవాడ బరిలో నిలిచేదెవరు?
* కేశినేని నాని, పొట్లూరి అభ్యర్థిత్వంపై టీడీపీ తర్జన భర్జన * లోక్‌సభ సీటు కోసం ఇద్దరూ చంద్రబాబుపై ఒత్తిడి * పవన్ అండ ఉన్న పొట్లూరివైపే టీడీపీ అధినేత మొగ్గు * ఓ మీడియా అధిపతి జోక్యంతో నానికే టికెట్ ఖరారైనట్లు ప్రచారం సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీకి దింపాలన్న విషయంపై టీడీపీ తర్జనభర్జన పడుతోంది. ఇక్కడి నుంచి తానే పోటీచేస్తానని కేశినేని ట్రావెల్స్ యజమాని కేశినేని నాని పట్టుబడుతుంటే, సినీనటుడు పవన్‌కల్యాణ్ మద్దతుందని చెప్పుకుంటున్న పీవీపీ గ్రూప్ యజమాని పొట్లూరి వరప్రసాద్ అంతకంటే ఎక్కువగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కేశినేని నానియే అక్కడ పార్టీ అభ్యర్థి అవుతారని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం కొందరు మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. మరోవైపు పొట్లూరి వరప్రసాద్‌కు టికెటిస్తే పార్టీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. చంద్రబాబు సైతం పవన్ పేరును ముందు పెట్టి బీజేపీని ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పొట్లూరికి మార్గం సుగమమైందన్న విషయం తెలిసిన నానీ వర్గం భగ్గుమంది. పవన్‌కల్యాణ్‌తో పాటు పొట్లూరిపై నాని విమర్శలకు దిగారు. ఆ సీటు నుంచి తానే పోటీచేస్తానని తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది. నానీని పిలిచి బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా తగ్గేది లేదని భీష్మించారు. విజయవాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓ మీడియా అధిపతి జోక్యం చేసుకున్నారు. నానికే టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తాజాగా నానీకే టికెట్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎవరెంత ప్రచారం చేసుకున్నా తానే విజయవాడ ఎంపీ అభ్యర్థినని, ఈ విషయంలో చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌కు హామీనిచ్చారని పొట్లూరి వరప్రసాద్ ధీమాగా చెబుతున్నారు. కాగా, చంద్రబాబుతో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే దిరశం పద్మజ్యోతి సోమవారం భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల లోక్‌సభ సీటును ఆమె ఆశిస్తున్నారు. ఈ మేరకు బాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
పొట్లూరి వర ప్రసాద్ కథనాల పై వాసిరెడ్డి పద్మ వివరణ