మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..? | Dil Raju replaces PVP for Mahesh Babu film | Sakshi
Sakshi News home page

మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..?

Published Fri, Dec 2 2016 12:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..?

మహేష్ సినిమాకు నిర్మాత మారిపోయాడా..?

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ బైలింగ్యువల్ సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే చేయనున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు.

గతంలో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పీవీపీ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుందని ప్రకటించారు. ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పొస్టర్పై మహేష్ స్పందించలేదు. పీవీపీ సంస్థ మాత్రం మహేష్తో తమకు రెండు సినిమాల ఒప్పందం జరిగిందని, బ్రహ్మోత్సవం తరువాత మరో సినిమా చేయాల్సి ఉందని ప్రకటించింది. తాజాగా పీవీపీ సంస్థ మహేష్తో నిర్మించాల్సిన సినిమా మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో మహేష్ బాబు హీరోగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బిగ్ హిట్ అందించిన దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం మహేష్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్న దర్శకుడు, వంశీ పైడిపల్లి త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement