మరోసారి మురారిగా మహేష్..! | Intresting New about Mahesh babu 25 titles | Sakshi
Sakshi News home page

మరోసారి మురారిగా మహేష్..!

Published Tue, Oct 24 2017 10:28 AM | Last Updated on Tue, Oct 24 2017 10:28 AM

Intresting New about Mahesh babu 25 titles

స్పైడర్ సినిమాతో ఆకట్టుకున్న మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. ఇది మహేష్ హీరోగా తెరకెక్కుతున్న 25వ సినిమా కావటంలో దిల్ రాజు, అశ్వనీదత్ లు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.     క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు కృష్ణ ముకుందా మురారి, హరే రామ హరే కృష్ణ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్స్ సినిమా కథతో పాటు మహేష్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement