సాక్షి, విజయవాడ : విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ నాయకులు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ధన్యవాదాలు తెలిపారు. గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాడినేనన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను, తమ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటామని పీవీపీ అన్నారు.
130 స్ధానాలకుపైగా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అనేక సార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా తక్కువ మార్జిన్‌తోనే ఓడిపోయానన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 19 రోజులే పార్లమెంట్ పరిధిలో పర్యటించానని, కొంచెం ముందు వచ్చి ఉంటే భారీ మెజారిటితో గెలిచేవాడినని పేర్కొన్నారు. ఇక నుండి రెగ్యులర్‌గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment