
తమిళంలో బెంగుళూరు డేస్
కోలీవుడ్‌లో బెంగుళూరు డేస్ మొదలైంది. మరో విషయం ఏమిటంటే ఈ వారంలో పివిపి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా మూడు చిత్రాలను మొదలెట్టింది. దీంతో ఈ వారం పివిపి వారంగా కోలీవుడ్ పేర్కొంటోంది. ఈ సంస్థ టాలీవుడ్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ యువ నటుడు కార్తీ, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమైం ది. గురువారం ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా ఇంజి ఇడుప్పళగు చిత్రం మొదలైంది. వీటితో పాటు బుధవారం ఆర్య బాబి సింహా, రానా దగ్గుబాటి, శ్రీదివ్య నటిస్తున్న చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ మూడు చిత్రాలు భారీ తారాగణంతో ద్విభాషాచిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. గత ఏడాది మల యాళంలో విడుదలై ఘన విజయం సాధించిన బెంగుళూరు డేస్ చిత్రానికి రీమేక్‌లోనే ఆర్య, రానా దగ్గుబాటి, బాలసింహా, శ్రీదివ్య నటిస్తున్నారు.