
‘పుట్టిన రోజున ఏంటే ఇది. ఇంకెన్ని హోమాలు చేయాలి? మీ చాదస్తం తగలెయ్యా. ఇంకో రెడు హోమాలు చేశానంటే.. అన్ని హోమాలు చేసినట్లు గిన్నీస్ బుక్‌లోకి ఎక్కొచ్చు’అంటూ కుటుంబ సభ్యులపై ఫుల్ ఫైర్ అవుతున్నాడు నేచురల్ స్టార్ నాని.ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
నాని బర్త్‌డే(ఫిబ్రవరి 24) పురస్కరించుకొని ఆయనకు మందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘అంటే సుందరానికి..’నుంచి చిన్న గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో నాని అమాయకపు బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు. అతని జీవితంలో గండాలు ఉన్నందున కుటుంబ సభ్యులు అతనితో తరచుగా హోమాలు చేయిస్తున్నారు. వరుస హోమాలతో విసిగెత్తిపోయిన నాని.. ‘బటకు వెళ్తే దినచక్ర వాహన గండం, నీళ్లల్లోకి వెళ్తే జలగండం, నడిస్తే రోడ్డు గండం, కూర్చుంటే కుర్చి గండం..దీనమ్మ గండం’అంటూ ఫ్యామిలీపై ఫైర్ అవుతున్నాడు.
‘అంటే మావాడి జాతకం ప్రకారం బర్త్‌డే హోమం జరిగిన 108 రోజుల వరకు బయటకు రాకూడదన్నారు. అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్స్ వస్తున్నాం’అంటూ చిత్రం ఈ గ్లింప్స్‌ని విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment