ఆట త్వరలో ఆరంభం | Nazriya Nazim Fahadh To Make Her Telugu Debut With Nani | Sakshi
Sakshi News home page

ఆట త్వరలో ఆరంభం

Published Sun, Nov 22 2020 6:03 AM | Last Updated on Sun, Nov 22 2020 6:03 AM

Nazriya Nazim Fahadh To Make Her Telugu Debut With Nani - Sakshi

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు ‘అంటే సుందరానికీ!’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను కర్టెన్‌ రైజర్‌ వీడియో ద్వారా ప్రకటించారు. నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ .వై నిర్మించనున్న ఈ సినిమా ద్వారా మలయాళ నటి నజ్రియా ఫాహద్‌ తెలుగు సినిమాకు పరిచయం కాబోతున్నారు. సంగీత ప్రాధాన్యమున్న వినోదాత్మక చిత్రం ఇదని చిత్రబృందం తెలిపింది.

ఈ టైటిల్‌ ప్రీలుక్‌ పోస్టర్‌లో పంచె కట్టుకుని ఎక్కడికో వెళ్లడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు నాని. ‘‘మునుపు ఎన్నడూ లేనంతగా ప్రేమిస్తాం. అలానే నవ్విస్తాం. 2021ని గ్రాండ్‌గా ముగిద్దాం. ఆట త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని ఈ సినిమా గురించి అన్నారు నాని. అంటే.. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలవుతుందని అర్థం అవుతోంది. ఈ సినిమాకు సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: నికేత్‌ బొమ్మి, ఎడిటర్‌: రవితేజ గిరిజాల, సీఈఓ: చెర్రీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement