తొలి పాటలోనే 'గరం గరం' అంటూ నాని రచ్చ | Actor Nani Saripodhaa Sanivaaram Movie Garam Garam Song Lyrical Video Out, Goes Viral | Sakshi
Sakshi News home page

Saripodhaa Sanivaaram Songs: తొలి పాటలోనే 'గరం గరం' అంటూ నాని రచ్చ

Published Sat, Jun 15 2024 1:44 PM | Last Updated on Sat, Jun 15 2024 3:21 PM

Saripodhaa Sanivaaram Movie Song Garam Garam Out Now

నాని హీరోగా నటిస్తున్న  పాన్‌ ఇండియా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'గరం గరం' అంటూ సాగే ఈ పాట నాని అభిమానుల్లో జోష్‌ను నింపుతుంది. హై బడ్జెట్‌తో యూనిక్‌ అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జేక్స్‌ బిజోయ్ అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement