‘పింక్‌’ రీమేక్‌తో రీ ఎంట్రీ | Nazriya Nazim To Come Back With Pink Remake | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 21 2018 10:11 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

Nazriya Nazim To Come Back With Pink Remake - Sakshi

ఒక్కసారి సినీరంగంలోకి ఎంటర్‌ అయితే దాని నుంచి బయటకు వెళ్లడం కష్టం. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగినా, శాశ్వతంగా దూరం అవడమూ సాధ్యం కాదు. ఇలా చాలా మంది తారలు ఏదో కారణంగా మధ్యలో నటనకు దూరమైనా మళ్లీ రీఎంట్రీ అవుతుంటారు. నటి నజ్రియా కూడా ఇందుకు అతీతం కాదు.

నేరం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ నజ్రియా. ఆ తరువాత రాజా రాణి, నైయాండి, తిరుమణం ఎనుమ్‌ నిక్కా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని మలయాళ చిత్రాల్లో నటించిన నజ్రియా మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కెరీర్‌ మంచి స్వింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.

అంతే కాదు ఇక నటనకు టాటా అనేయడాన్ని కూడా ఎవరూ ఊహించలేదు. అలా ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరగా 2014లో తిరుమణం ఎనుమ్‌ నిక్కా చిత్రంలో నటించింది. అంటే దాదాపు ఐదేళ్లు అవుతోంది. అంతే గోడకు కొట్టిన బంతిలా ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యిపోతోంది. నజ్రియా ఇప్పటికే మలయాళంలో రీఎంట్రీ ఇచ్చింది. తన భర్త నిర్మాతగా రూపొందుతున్న రెండు చిత్రాల్లో నటించేస్తోంది.

ఇప్పుడు కోలీవుడ్‌లో అవకాశం వచ్చిందనేది తాజా సమాచారం. అయితే ఈ సారి ఏకంగా అల్టిమేట్‌ స్టార్‌ అజిత్‌తోనే నటించే అవకాశాన్ని కొట్టేసిందంటున్నారు. అజిత్‌ ప్రస్తుతం విశ్వాసం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో అజిత్‌ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు.

హిందీలో సంచలన విజయన్ని సాధించిన పింక్‌ చిత్ర రీమేక్‌లో అమితాబ్‌బచ్చన్‌ పాత్రను పోషించనున్నారు. దీనికి చతురంగవేట్టై చిత్రం ఫేమ్‌ హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ద్వారా నటి నజ్రియా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ భామ నటి తాప్సీ పాత్రను పోషించనుందా, వేరే పాత్రా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా నజ్రియా రీఎంట్రీ మాత్రం పక్కా అని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement