నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ మూవీ రాయల్ ఈవెంట్ మంగళవారం వరంగల్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వేదికగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వేడుకు హీరో నాని, హీరోయిన్స్ సాయి పల్లవి, కృతిశెట్టిలతో ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన సుమపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టేజ్‌పై నాని మాట్లాడుతూ.. ‘డైరెక్టర్లు, నిర్మాతలు హీరోల కాల్‌షిట్ కోసం ఎదురు చూస్తారు. కానీ హీరోలు మాత్రం ఒకరి డేట్స్ కోసం చూస్తారు. ఆవిడే సుమగారు.
ప్రీరిలీజ్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు ఏ మూవీ ఈవెంట్ అయిన సుమ డేట్స్ చూసుకుని ప్లాన్ చేస్తాం’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు నాని. దీంతో సుమ నవ్వుతూ నానికి దండం పెడుతూ థ్యాంక్స్ చేప్పింది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి గురించి చెబుతూ.. ‘ఈ సినిమాలోని ఓ సీన్‌లో పల్లవి డాన్స్ చేస్తుంటే.. నేను జనంలో నుంచి ఆశ్చర్యంగా చూస్తుండాలి. ఆమె డాన్స్ చూస్తూ నటించడం మరిచిపోయాను.. నటించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే నిజంగానే తన డ్యాన్స్ చూసి అంతగా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయాను’ అంఊట చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment