ఆకట్టుకుంటున్న నాని శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ ట్రైలర్‌ | Hero Nani Shyam Singha Roy Movie Trailer Launch In Warangal | Sakshi
Sakshi News home page

Shyam Singha Roy: ఆకట్టుకుంటున్న నాని శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ ట్రైలర్‌

Published Tue, Dec 14 2021 8:14 PM | Last Updated on Tue, Dec 14 2021 8:35 PM

Hero Nani Shyam Singha Roy Movie Trailer Launch In Warangal - Sakshi

నేచురల్‌ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’.రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలై టీజర్‌, ఫస్ట్‌లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్‌ కార్యక్రమాలతో మూవీ టీం బిజీగా ఉంది.

చదవండి: హీరోగా ‘కట్టప్ప’కొడుకు.. ‘మాయోన్' ఫస్ట్‌ సింగిల్‌కి అనూహ్య స్పందన

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ రోజు(డిసెంబర్‌ 14) వరంగల్‌లో ట్రైలర్‌ లాంచ్‌ రాయల్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఈ క్రమంలో తాజాగా శ్యామ్‌ సింగరాయ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. ఇక డిసెంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement