
మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు
భలే..భలే.. మగాడివోయ్ చిత్రం విజయం సాధిస్తుందని భావించానని, అయితే ఇంత పెద్ద విజయం
చినకాకాని(మంగళగిరి రూరల్) : భలే..భలే.. మగాడివోయ్ చిత్రం విజయం సాధిస్తుందని భావించానని, అయితే ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని చిత్ర కథనాయకుడు నాని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో శుక్రవారం రాత్రి సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సక్సెస్ చేస్తారని విశ్వాసం ఉందన్నారు. చిత్ర ప్రొడ్యూసర్ బన్నీవాసు మాట్లాడుతూ భలే..భలే మగాడివోయ్ సినిమాను ఒక యజ్ఞంలా చేశారన్నారు.
గుంటూరు జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా వచ్చి ప్రొడ్యూసర్‌గా ఎదిగానని, ఈ విజయం హీరో నాని, డెరైక్టర్ మారుతీలదేనని చెప్పారు. డెరైక్టర్ మారుతీ మాట్లాడుతూ మొదటి సారి విజయోత్సవం నిర్వహించుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. అందరి ఆశీస్సులతో మరిన్ని చిత్రాలకు డెరైక్షన్ చేస్తానన్నారని చెప్పారు. హీరోయిన్ లావణ్య నటన అద్భుతంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిరామ్, హాయ్‌ల్యాండ్ జీఎం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.