నేచురల్ స్టార్ నాని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న నానికి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికారు.. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆయనతో పాటు నటుడు బెనర్జీ కూడా ఉన్నారు. కాగా నాని ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు.
చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్
నాని ప్రస్తుతం దసరా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment